సూపర్ స్టార్ మహేష్ లోని ఎంటర్ ప్రెన్యూర్ క్వాలిటీస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఓవైపు సినిమాలు- వాణిజ్య ప్రకటన(బ్రాండ్ అంబాసిడర్)లతో తన స్థానాన్ని నిలబెట్టుకుంటూనే మరోవైపు రకరకాల వ్యాపారాల్లోనూ సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ఇటీవలే ఏఎంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్ చెయిన్ బిజినెస్ లో ప్రవేశించారు. ఇంద్రభవనాన్ని తలపించే అద్భుతమైన మల్టీప్లెక్స్ ని హైదరాబాద్ ప్రజలకు చేరువ చేశారు. తెలుగు రాష్ట్రాలు సహా మెట్రోల్లో ఈ చెయిన్ ని విస్తరించనున్నారు. మరోవైపు జి మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ పేరుతో సొంతంగా బ్యానర్ ప్రారంభించి అందులో నవతరం హీరోలతో సినిమాలు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే అడివి శేష్- దేవరకొండ లాంటి స్టార్లకు అవకాశాలిచ్చారు.
మరోవైపు మహేష్ రకరకాల వ్యాపారాల్లోకి ప్రవేశిస్తుండడం హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ వస్త్ర శ్రేణి బిజినెస్ లోకి ప్రవేశిస్తున్నారు. సొంతంగా ఇ-కామర్స్ వెబ్ సైట్ ప్రారంభించి డిజైనర్ దుస్తుల వ్యాపారంతో యూత్ లోకి దూసుకెళ్లాలన్నది ప్లాన్. అందుకోసం ఆల్రెడీ మార్కెట్లో పాపులరైన `స్పాయిల్` అనే ఇ-కామర్స్ బ్రాండ్ ని టేకోవర్ చేశారు. కొన్ని ఏళ్ల క్రితమే ఈ బ్రాండ్ ని టేకోవర్ చేసి వ్యాపారవృద్ధి కోసం గ్రౌండ్ వర్క్ చేస్తున్నారట. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇకపోతే టాలీవుడ్ లో ఈ తరహాలో వస్త్ర శ్రేణి వ్యాపారంలో విజయ్ దేవరకొండ అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. రౌడీ పేరుతో ఓ బ్రాండ్ ని అతడు పాపులర్ చేశాడు. తాజాగా రౌడీ తనకు ఉన్న లేడీ ఫ్యాన్స్ దృష్ట్యా వారి కోసం లేడీ రౌడీ వేర్ పేరుతో మరో బ్రాండ్ ని దించుతున్నారట. అందుకోసం ఇప్పటికే ప్రముఖ వస్త్ర శ్రేణి రిటైల్ బిజినెస్ ఫర్మ్ తో ఒప్పందం కుదుర్చుకున్నారు. బాలీవుడ్ లో ఈ తరహా వ్యాపారాలు కొత్తేమీ కాదు. అక్కడ ప్రముఖ స్టార్లు అనుష్క శర్మ- సోనమ్ కపూర్- దీపిక పదుకొనే- సన్నీలియోన్- హృతిక్ రోషన్ ఇప్పటికే ఇ-కామర్స్ రంగంలో ఫేమస్. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం వస్త్ర శ్రేణి వ్యాపారంలో ఉన్నారు. టాలీవుడ్ నుంచి దేవరకొండ.. మహేష్ ఈ రంగంలో ప్రవేశించడం ఆసక్తికరం.