ప్రపంచాన్నే వణికించేస్తున్న కరోనా మహమ్మారి తన ఉగ్రరూపం చూపిస్తోంది. ఇప్పటికే 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్ భారతదేశాన్ని కూడా తాకింది. యావత్ దేశం మొత్తం కూడా చిగురుటాకులా వణికిపోతోంది. ప్రముఖ పారిశ్రామికవేత్తల నుంచి సినీ సెలబ్రిటీల వరకూ తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్ధికసాయం ఇప్పుడు ఊపందుకుంది.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా భారీగానే విరాళం అందించాడు. ఈ మధ్యే సరిలేరు నీకెవ్వరు సినిమాతో సంచలన విజయం అందుకున్న ఈయన.. సాయంలో కూడా సరిలేరు అనిపించుకున్నాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి ఏకంగా కోటి రూపాయల విరాళం అందించాడు సూపర్ స్టార్. దాంతో పాటు కరోనా వైరస్ అరికట్టడానికి రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు - చేస్తున్న చర్యలపై ప్రశంసల వర్షం కురిపించాడు మహేష్. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ నేపథ్యంలో పౌరులందరూ రూల్స్ పాటిస్తూ, ఒకరినొకరు రక్షించుకుంటేనే ఈ యుద్ధంలో గెలుస్తామని, అప్పటి వరకు ఇంట్లోనే ఉంటూ సురక్షితంగా ఉండండి అంటూ ప్రకటన చేశారు.