సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన కుటుంబంతో అమెరికా ట్రిప్ లో ఉన్నారు. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రమోషన్స్ పూర్తి కాగానే తన కుటుంబంతో అమెరికాకు వెళ్లిన మహేష్ అక్కడ వేకేషన్ ను ఎంజాయ్ చెయ్యడమే కాకుండా అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. మహేష్ మాత్రమే కాదు.. మహేష్ సతీమణి నమ్రత కుడా తమ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పంచుకుంటూనే ఉన్నారు.
అయితే అభిమానులు.. నెటిజన్లు మహేష్ డ్రెస్సులను గమనిస్తారు కదా. వారు ఒక విషయం గుర్తించారు. ఈ ఫోటోలలో మహేష్ డ్రెస్సులు మారుతున్నాయి. క్యాప్స్ మారుతున్నాయి. కానీ మహేష్ ధరించిన షూ మాత్రం మారడం లేదు. మహేష్ పసుపు రంగు డిజైన్ ఉన్న నైకి బూట్లు ధరించారు. అన్ని ఫోటోలలో మహేష్ ఈ షూనే ధరించి కనిపిస్తున్నారు. సహజంగా సెలబ్రిటీ లు ఇలా టూర్ల లో ఉన్నప్పుడు రోజుకో షూ ధరిస్తారు. అమెరికా లో స్పోర్ట్స్ షూస్ 100 డాలర్స్ రేంజ్ లోపే ఉంటాయి. దీంతో సెలబ్రిటీలు పాదరక్షల పండగ చేస్తారు. కానీ మహేష్ మాత్రం ఒకే షూతో కనిపిస్తున్నారు. ఈ విషయం గమనించిన ఫ్యాన్స్ మహేష్ సింప్లిసిటీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ షూ సూపర్ స్టార్ కు ఎక్కువగా నచ్చిందేమో అని అనుకుంటున్నారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం డ్రెస్సులతో పాటు మహేష్ షూస్ కూడా మారిస్తే ఇంకా స్టైల్ గా ఉంటారని అంటున్నారు. ఏదైతేనేం.. ఒకటి మాత్రం నిజం.. సూపర్ స్టార్ బూట్లు ఇప్పడు సోషల్ మీడియా లో ఒక హాట్ టాపిక్ గా మారాయి.
ఇక మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అమెరికా ట్రిప్ నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగుతోంది. ఈ సినిమాకు థమన్ ను సంగీత దర్శకుడిగా ఎంచుకున్నారని సమాచారం.