‘భరత్ అనే నేను’ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది... అయినా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి భరత్ ఏ మాత్రం విశ్రాంతి తీసుకోవట్లేదు. ప్రమోషన్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ తెగ బిజీ బిజీగా గడుపుతున్నాడు. రెండు డిజాస్టర్లతో ఢీలా పడిన సూపర్ స్టార్ అభిమానులను సంతోష పెట్టేలా ప్రిన్స్ పీఆర్ టీం పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నట్టు ఉంది.
‘భరత్ అనే నేను’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు యంగ్ టైగర్ ఎన్.టీ.ఆర్ హాజరయ్యాడు. ఈతరానికి ఒక స్టార్ హీరో సినిమా ఫంక్షన్ కి దాంతో ఏ సంబంధం లేని మరో స్టార్ హీరో హాజరవ్వడం ఓ స్వీట్ షాకింగ్ న్యూసే. దాంతో ఇద్దరి హీరోల అభిమానుల సపోర్ట్ భరత్ కి దక్కింది. ఆ తర్వాత వీరిద్దరితో జత కలిసాడు చెర్రీ. రామ్ చరణ్- ఎన్.టీ.ఆర్ లతో కలిసి మహేష్ పార్టీ చేసుకుంటున్న ఫోటో బయటికొచ్చింది. ముగ్గురు లెజండరీ కుటుంబాల వారుసులు... నేటి స్టార్లు కలిసిన ఆ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. దాంతో మళ్లీ భరత్ కి కావల్సినంత క్రేజ్ పెరుగుతూ పోయింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే.టీ.ఆర్ మహేష్- కొరిటాల శివతో కలిసి ‘భరత్ అనే నేను’ సినిమా చూశారు. ఈ పొలిటికల్ డ్రామా మూవీ తెగ నచ్చేసిందని కితాబు ఇచ్చాడు.
ఇప్పుడు తాజాగా మడామే టూసాడ్స్ మ్యూజియంలో మహేష్ మైనపు బొమ్మ పెడుతున్నారనే వార్త తెలిసింది. దీంతో దక్షిణాదిలో మహేష్ కీ... కాదు కాదు... ముఖ్యమంత్రి భరత్ కి ఫుల్లు పాపులారిటీ వచ్చేసింది. ఇక మనోడు ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో విజయవాడ వెళ్ళాడు. అక్కడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని.. ధియేటర్లలో ప్రచారం మొదలెట్టాడు. అటునుండటే తిరుపతి కూడా వెళ్ళే ఛాన్సుంది. చూస్తుంటే మున్ముందు భరత్ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. టార్గెట్ రంగస్థలం పెట్టుకుని ముందుకు వెళుతున్నాడు సూపర్ స్టార్.