మహేశ్ బాబు హీరోగా 'సర్కారువారి పాట' సినిమా రూపొందింది. మైత్రీ - 14 రీల్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. తొలిసారిగా ఈ సినిమాలో మహేశ్ సరసన నాయికగా కీర్తి సురేశ్ అలరించనుంది. 'నేను శైలజ' .. 'నేను లోకల్' తరువాత హీరోతో ఆమె రొమాంటిక్ స్టెప్పులు వేసిన సినిమా ఇది. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మహేశ్ బాబును .. బిత్తిరి సత్తి ఇంటర్వ్యూ చేశాడు. తనదైన స్టైల్లో ఈ సినిమాకి సంబంధించిన విశేషాలను మహేశ్ తో చెప్పించాడు.
" ఎప్పుడూ కూడా ఒక సినిమా చేయగానే పిల్లలను తీసుకుని ఫారిన్ వెళ్లి వస్తాను. ఇక్కడ తిరిగితే నువ్వు తిరగనిస్తావా చెప్పు. ఇక్కడ తిరగడం కంటే ఫారిన్ లో తిరిగితే బాగుంటుంది. అందుకే ఎక్కువగా యూరప్ వెళుతుంటాను. సినిమా విషయానికి వస్తే .. పరశురామ్ ఓ 10 .. 15 నిమిషాలు కథ చెప్పగానే, ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాను. ఆయన చెప్పే విధానం .. నా పాత్రను డిజైన్ చేసిన తీరు నాకు నచ్చింది. నేను హ్యాండ్సమ్ గా ఉన్నానని అంత అంటూ ఉంటే వినడానికి నాక్కూడా బాగుంటుంది. ఏదైనా సరే ఎక్కువగా కాకుండా ఒక పద్ధతిగా తింటాను అంతే.
"ఏంది సార్ .. సినిమాల్లా తాళాల గుత్తి బట్టుకుని ఒకటే తిరుగుతుండ్రు .. అయి బండి తాళాలా? బంగ్లా తాళాలా?" అనే మాటకి మహేశ్ ఒక్కసారిగా నవ్వేశాడు. ఆ తరువాత అవి బ్యాంకు తాళాలు అని చెప్పేశాడు. ఆ తాళాలు తన దగ్గర ఎందుకు ఉన్నాయనేది పరశురామ్ ను అడగడమే కరెక్ట్ అని చెప్పాడు. మిమ్మల్ని ఎవరైనా మిమిక్రీ చేస్తున్నపుడూ మీకు ఏమనిపిస్తుంది? అనే ప్రశ్న మహేశ్ బాబుకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ, "నాకు తెలిసి నా డైలాగ్ డైలివరీని ఎవరూ మిమిక్రీ చేయలేరు .. ఇంపాజిబుల్. ఎవరైనా ట్రై చేసినా కరెక్టుగా అయితే రాదు" అన్నాడు.
ఆ తరువాత బిత్తిరి సత్తి ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ .. "నాతో పాటలు పాడించడానికి చాలామంది ట్రై చేశారు గానీ .. నేను పాడలేదు. నాకు పాటలు పాడటం రాదు. మనకి తెలిసిన పని చేయడమే మంచిదనేది నా ఉద్దేశం. ప్రస్తుతం 'సర్కారువారి పాట'కి సీక్వెల్ చేసే ఆలోచన లేదు. పాన్ ఇండియా సినిమాలు చేయాలనే ఆలోచన లేదు. సందేశం ఉన్న సినిమాలే చేయాలని నేను అనుకోను .. అలా కొన్ని కుదిరాయంతే. 'మ మ మహేశా' పాటలో నా పేరుపై పాట అవసరమా అని అడిగాను. డైరెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే ఓకే అన్నాను" అని చెప్పుకొచ్చాడు.
Full View