తల్లికి తలకొరివి పెట్టిన మహేష్ బాబు

Update: 2022-09-28 14:36 GMT
సూపర్ స్టార్‌ కృష్ణ సతీమణి.. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మరణ వార్త ప్రతి ఒక్కరిని కలచి వేసింది. ఆమె మృతిని జీర్ణించుకోలేక కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. సితార గుక్క పట్టి వెక్కి వెక్కి ఏడ్చిన విజువల్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నేడు తెల్లవారుజామున మృతి చెందిన ఇందిరా దేవి గారి అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉందని అంతా భావించారు.

కానీ ఆమె అనారోగ్యం తో మృతి చెందడం తో పాటు కొన్ని కారణాల వల్ల కొన్ని గంటల్లోనే అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చిందని సమాచారం అందుతోంది.

తెల్లవారుజామున చనిపోయిన ఇందిరా దేవి గారి యొక్క అంత్యక్రియలు మధ్యాహ్నం కి పూర్తి చేశారు. మహేష్ బాబు చేతుల మీదుగా ఈ కార్యక్రమాలు జరిగాయి.

తల్లి ఇందిరా దేవి గారికి చిన్న కొడుకు అయిన మహేష్‌ బాబు తలకొరివి పెట్టాడు. హిందూ సాంప్రదాయం ప్రకారం మహా ప్రస్థానంలో ఈ అంత్యక్రియలు నిర్వహించారు.

పద్మాలయ స్టూడియోస్ నుండి అంతిమ యాత్ర చాలా స్పీడ్‌ గా మహాప్రస్థానంకు సాగింది. మహేష్‌ బాబు కారులో మహా ప్రస్తానం చేరుకోగా.. ప్రత్యేక వాహనంలో ఇందిరా దేవి మృతదేహంను తరలించారు.

మహేష్ బాబు తలకొరివి పెట్టి అంత్యక్రియలు నిర్వహించారు. ఇందిరా దేవి యొక్క అంతిమ యాత్రలో వేలాది మంది సినీ అభిమానులు మరియు పలువురు ప్రముఖులు కృష్ణ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా పాల్గొన్నారు. మహేష్ బాబుకు సన్నిహితులు అయిన వారు కుటుంబ సభ్యులు అంతిమ సంస్కారాలు నిర్వహించే సమయంలో పక్కనే ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News