మహేష్ కు కూడా అసహనం వచ్చేసింది

Update: 2015-12-21 15:09 GMT
ఎంత సినిమా తారలైనా వాళ్లూ మనుషులే కదా. ఆ సంగతి అర్థం చేసుకోకుండా మరీ విసిగిస్తే ఎవరికైనా చిర్రెత్తుకొస్తుంది. మహేష్ కూడా అలాగే చిరాకు పడిపోయాడు. అభిమానుల విషయంలో సాధ్యమైనంత వరకు సంయమనంతో వ్యవహరించే మహేష్.. ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ సందర్భంగా మాత్రం కొంత అసహనానికి గురయ్యాడు. కొందరు అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో వారికి క్లాస్ కూడా పీకి పంపాడు. ఈ సంఘటన ఊటీలో జరగడం విశేషం.

గత కొన్ని రోజులు ’బ్రహ్మోత్సవం’ షూటింగ్ ఊటీలో జరుగుతున్న సంగతి తెలిసిందే. అక్కడ కూడా మహేష్ కు అభిమానులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. మహేష్ సినిమా షూటింగ్ జరుగుతోందని తెలిసి పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన హీరోతో ఫొటోలు దిగాలని ఆరాటపడ్డారు. ఐతే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కాదనేవాడు కానీ.. ఊటీలోనూ తన మీద ఇంత అభిమానంగా వచ్చిన వారి కోరిక కాదనలేక ఒప్పుకున్నాడట మహేష్.

తమ దగ్గర కెమెరా లేదని అంటే.. షూటింగ్ స్పాట్‌లో ఉన్న కెమెరామన్‌ ని పిలిపించి మరీ వాళ్లతో ఫొటోలు దిగాడట. ఐతే ఈ సందర్భంగా అభిమానులు కొంచెం శ్రుతి మించడం.. ఫొటోల కోసం మరీ ఎక్కువ మంది ఎగబడ్డంంతో మహేష్ అసహనానికి గురయ్యాడట. ఇలా షూటింగ్ స్పాట్ కు వచ్చి ఇబ్బంది పెడితే ఎంత సమయం వృథా అవుతుందో వారికి కాస్త గట్టిగా చెప్పి, మందలించి పంపాడట ప్రిన్స్.
Tags:    

Similar News