ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో హీరోలకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పవచ్చు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇండస్ట్రీల్లో తమకు నచ్చిన హీరోలను అభిమానులు డెమీగాడ్ లు కొలుస్తుంటారు. గతంలో అయితే, ఏ సినిమా రిలీజ్ రోజునో....బర్త్ డే రోజునో ఏ హీరోకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని ఒక అంచనా వచ్చేది. అయితే, ఈ టెక్ జమానాలో...సోషల్ మీడియా హవా పెరిగిన తర్వాత నంబర్ గేమ్ మొదలైంది. ట్విటర్ లో ఆయా హీరోలకున్న ఫాలోయింగ్ ను బట్టి....టీజర్, ట్రైలర్, బర్త్ డే డీపీ...వైరల్ అయిన వ్యవధిని బట్టి అభిమానాన్ని నిరూపించుకుంటున్నారు ఫ్యాన్స్. సోషల్ మీడియా ఖాతాల్లో హీరోలకున్న ఫాలోవర్లను బట్టి ఆ హీరోకి ఉన్న క్రేజ్ ను అంచనా వేయవచ్చు. ఈ క్రమంలోనే దక్షిణాది హీరోల్లో టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఓ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. తాజాగా ప్రిన్స్ మహేష్ ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న దక్షిణాది హీరోగా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ట్విట్టర్లో మహేష్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 11 మిలియన్ ప్లస్‌కు చేరింది.
ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లలో టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు తన సినిమాలకు, టూర్లకు సంబంధించిన అప్డేట్లను ఫ్యాన్స్ తో షేర్ చేస్తుంటాడు. తనతోపాటు నమ్రతా శిరోద్కర్, గౌతమ్, సితారలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటాడు మహేష్. ఇటు మాస్ అటు క్లాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ టాప్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక, కరోనా లాక్డౌన్ టైమ్ లో మహేష్....సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ట్విటర్ లో మహేష్ బాబు 11 మిలియన్ల క్లబ్‌లోకి చేరాడు. దక్షిణాది హీరోల్లో 11 మిలియన్ల క్లబ్ లో చేరిన తొలిహీరో మహేష్ కావడం విశేషం. ఇప్పటికే మహేష్ కు ఇన్ స్ట్రాగమ్ లో 6.1 మిలియన్ ఫాలోవర్స్ ఉండగా, ఫేస్ బుక్ లో 5.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. టాలీవుడ్ లో ఎక్కువమంది ఫాలోవర్లున్న హీరోగా మహేష్ బాబు కొనసాగుతున్నారు. దీంతో, #11millionmaheshians అన్న హ్యష్ ట్యాగ్ ను మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఆల్ టైం రికార్డ్ అంటూ దూకుడులో మహేష్ బాబు చెప్పిన డైలాగ్ తో మీమ్స్ క్రియేట్ చేసి వైరల్ చేస్తున్నారు.