సూపర్ స్టార్ మహేష్ కి ఓవర్సీస్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా మహేష్ సినిమాలు అమెరికాలో భారీ కలెక్షన్లతో చక్కని ఫలితాల్ని అందుకుంటున్నాయి. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` నుంచి ఓవర్సీస్ లో మహేష్ కి ప్రత్యేకించి మార్కెట్ పెరిగింది. నిన్న మొన్న రిలీజైన `భరత్ అనే నేను` సైతం పెద్ద విజయం అందుకుంది. ఈ ఫలితాన్ని బట్టి విదేశీ బిజినెస్ లో మహేష్ హవా సాగాలి కదా? కానీ అందుకు పూర్తి విరుద్ధంగా `మహర్షి` నిర్మాతలకు అమెరికా ఓవర్సీస్ బిజినెస్ విషయంలో చెమటలు పడుతున్నాయని తెలుస్తోంది. నిర్మాత దిల్ రాజులో టెన్షన్ వాతావరణం అలుముకుందని చెబుతున్నారు.
వాస్తవానికి మహేష్ సినిమాలన్నీ ఓవర్సీస్ లో వసూళ్ల పంట పండిస్తున్న మాట నిజమే అయినా.. భారీ ధరలకు డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొనాల్సి రావడంతో ఎవరికీ గిట్టుబాటు కావడం లేదట. గత ఏడెనిమిది సినిమాల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తే అమెరికా లో రిలీజ్ చేసిన పంపిణీదారులు లాభాలు చూసింది ఒకే ఒక్క `శ్రీమంతుడు` విషయంలోనే. ఇతర సినిమాలన్నీ బాగా ఆడినా పంపిణీ చేసిన వాళ్లకు మాత్రం డబ్బు రాలేదు. మహేష్ నటించిన గత చిత్రం `భరత్ అనే నేను` హిట్టయినా అధిక ధరలు వెచ్చించి కొనడం వల్ల సరిగా లాభాలు రాలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం అదే కారణం `మహర్షి` అమెరికా బిజినెస్ కి కొరకరాని కొయ్యలా మారిందట. మహర్షి డీల్ ని భారీ ధరలకు కోట్ చేస్తుంటే ఎవరూ కొనడం లేదని తెలుస్తోంది. మహేష్ సినిమా రాక కోసం ఘట్టమనేని అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. `భరత్ అనే నేను` తర్వాత మళ్లీ చాలా గ్యాప్ తో మహేష్ నటించిన `మహర్షి` రిలీజ్ కి వస్తుండడంతో ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఉగాది కానుకగా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. మరో రెండు మూడు వారాల్లో 75 శాతం షూటింగ్ పూర్తవుతుందట. అటుపై పాటలు - కొంత టాకీ బ్యాలెన్స్ ఉంటుంది. ఫిబ్రవరి నాటికి మొత్తం షూటింగ్ పూర్తి చేసి నిర్మాణానంతర పనులు కానిచ్చేస్తారట.