సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి' మే 9 న రిలీజ్ అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం డీసెంట్ కలెక్షన్స్ నమోదు చేస్తోంది. ముఖ్యంగా పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో 'మహర్షి' తన జోరు చూపిస్తోందని సమాచారం.
మొదటి వీకెండ్ లో అంటే ఆదివారం వరకూ కర్ణాటకలో రూ. 6.07 కోట్లు షేర్ వసూలు చేసింది. ఇందులో రూ. 3.45 కోట్లు బెంగుళూరు నగరంనుంచి వచ్చిన కలెక్షన్స్. దీన్ని బట్టి కర్ణాటకలో మహేష్ బాబు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు ఈ సినిమా కలెక్షన్స్ లో సోమవారం నాడు కూడా పెద్దగా డ్రాప్ లేదని.. ఇదే జోరు కొనసాగితే 'మహర్షి' హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రాలలో స్థానం సాధించడం ఖాయమని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు.
సమ్మర్ హాలిడేస్ కావడంతో అడ్వాంటేజ్ ను 'మహర్షి' ఫుల్ గా వాడుకుంటోందని.. కాంపిటీషన్ లో కూడా మరో రెండువారాలు చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడం కూడా 'మహర్షి'కి ప్లస్ అవుతుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే 'మహర్షి' సినిమాను భారీ రేట్లకు అమ్మడంతో బ్రేక్ ఈవెన్ అయ్యేందుకు ఇంకా చాలా దూరం పయనించాల్సి ఉంది.