మహేష్ బాబు ఫ్యాన్స్ రోజుల ప్రకారం కౌంట్ డౌన్ వేసుకుని మరీ ఎదురు చూస్తున్న మహర్షి జస్ట్ ఇంకో 39 రోజుల్లో వచ్చేస్తుంది. ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడటంతో అభిమానులు అసహనం స్టేజి దాటి పోయారు. ఎట్టి పరిస్థితుల్లో ఆ తేదీకి రిలీజ్ చేసే విషయంలో యూనిట్ రాజీ పడే ప్రసక్తి లేదు కానీ తాజాగా వచ్చిన అప్ డేట్ కొంత టెన్షన్ పెట్టేలా ఉంది .
దాని ప్రకారం మహర్షి షూటింగ్ ఇంకా పూర్తి కాలేదట. రెండు పాటలు బాలన్స్ ఉన్న విషయం తెలిసిందే కాని టాకీ పార్ట్ కూడా కొంత తీయాల్సి ఉందని తెలుస్తోంది. దీని కోసం ప్రత్యేకంగా యూనిట్ అబుదాబి వెళ్ళే ప్లానింగ్ లో ఉంది. దాని కన్నా ముందే పెండింగ్ లో ఉన్న సాంగ్స్ ని సెట్స్ వేసి అన్నపూర్ణ స్టూడియోస్ లో తీసి ఆ తర్వాత బయలుదేరతారని తెలిసింది
ఇప్పటిదాకా పూర్తైన భాగానికి డబ్బింగ్ పూర్తి చేశారు. రీ రికార్డింగ్ కూడా జరిగినట్టు చెబుతున్నారు కాని ఖచ్చితమైన సమాచారం లేదు. దేవిశ్రీ ప్రసాద్ ఫైనల్ కాపీ ఇస్తేనే వర్క్ చేయడం అలవాటు. దానికి భిన్నంగా మహర్షికి వెళ్ళడు అనుకుంటే ఏప్రిల్ నెలాఖరుకు కాని తన చేతికి ఇచ్చే ఛాన్స్ లేదట. ఇదే నిజమైతే డే అండ్ నైట్ వర్క్ చేసి దేవి మహర్షి రీ రికార్డింగ్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది.
అంత హడావిడి అంటే క్వాలిటీ మీద ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. ఇదంతా యూనిట్ నుంచి వచ్చిన అధికారిక సమాచారం కాదు కాని ఫిలిం నగర్ లో టాక్ అయితే బలంగా నడుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తనకు అలవాటైన ధోరణిలోనే మహర్షి విషయంలో ఆలస్యం చేయడం ఇప్పటికే విమర్శలకు దారి తీస్తోంది. ఏదో ఒకటి హీరోనో దర్శకుడో స్వయంగా క్లారిటీ ఇస్తేనే బెటర్