మహేష్ బాబు తన సినిమాల ప్లానింగ్ విషయంలో చాలా పక్కాగా ఉంటాడని పేరు. ప్రి ప్రొడక్షన్ దశలోనే అన్నీ పక్కాగా చూసుకుని.. షెడ్యూళ్ల ప్రకారం షూటింగ్ పూర్తి చేయించి.. ముందు అనుకున్న ప్రకారం సినిమాను రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉండాలన్నది అతడి అభిప్రాయం. ఐతే ‘బ్రహ్మోత్సవం’ విషయంలో మాత్రం మహేష్ అనుకున్న ప్రకారం ఏదీ జరగలేదు. షూటింగ్ లేటైంది. రిలీజ్ డేట్ మారింది. షూటింగ్ అంతా పూర్తయ్యాక కూడా రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ లేదు. ఆడియో డేట్ వరకు కన్ఫమ్ అయింది కానీ.. రిలీజ్ డేట్ విషయంలో ఇంకా సస్పెన్స్ నడుస్తోంది. చివరికి మహేష్ బాబునే రిలీజ్ డేట్ గురించి అడిగినా.. అతను సైతం క్లారిటీ ఇవ్వలేదు.
‘బ్రహ్మోత్సవం’ ఆడియో విడుదలవుతున్న నేపథ్యంలో ఓ ఇంగ్లిష్ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బ్రహ్మోత్సవం రిలీజ్ డేట్ విషయంలో నెలకొన్న గందరగోళం గురించి మహేష్ ను ప్రశ్నించగా.. ‘‘ప్రస్తుతానికి ఆడియో 7వ తారీఖున రిలీజ్ చేస్తున్నాం. సినిమా విడుదల ఎప్పుడన్నది తర్వాత అఫీషియల్ గా ప్రకటిస్తాం’’ అంటూ సమాధానం దాటవేశాడు మహేష్. ఇక ‘బ్రహ్మోత్సవం’ విశేషాల గురించి మాట్లాడుతూ.. ‘‘ఇది ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ లో సాగే ప్రేమకథ. జనాల ఎమోషన్లను వివిధ స్థాయిల్లో చూపిస్తాం. నా క్యారెక్టర్ పరంగా మరోసారి కొత్తగా ట్రై చేస్తున్నాం. ఈ స్క్రిప్టు నాకెంతగానో ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. నేను ఏ సినిమా చేయాలన్నా అలాంటి ఎగ్జైట్మెంట్ వస్తేనే చేస్తాను. అన్ని రకాల ప్రేక్షకులకూ ఈ సినిమా నచ్చుతుంది’’ అని మహేష్ చెప్పాడు.