వరుసగా ఒకదాని వెంట ఒకటిగా సినిమాలు ప్రారంభించేస్తూ.. రీఎంట్రీ ఇచ్చిన పక్షం రోజుల్లోనే నాలుగైదు సినిమాలపై క్లారిటీ ఇచ్చేశాడు పవన్. పవర్ స్టార్ దూకుడుకు మహేష్ బెంబేలెత్తినట్టే కనిపిస్తోంది. కారణం ఏదైనా ఇప్పటికే మహేష్ వరుసగా స్టార్ డైరెక్టర్లను లైన్ లో పెట్టి సినిమాలకు కమిటవుతుండడం ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చకు తెరలేపింది.
సూపర్ స్టార్ మహేష్ ఇటీవలే `సరిలేరు నీకెవ్వరు`తో మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్నాడు. బాక్సాఫీస్ వసూళ్లలో బ్లాక్ బస్టర్ కా బాప్ అనిపించాడు. సక్సెస్ కిక్కులో ఫ్యామిలీతో నేరుగా అమెరికా పయనమయ్యాడు. అటుపై వెకేషన్ ముగించి తిరిగి హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యాడు. మళ్లీ కెమెరా..యాక్షన్ అంటూ సీరియస్ మోడ్ లోకి మైండ్ ని సెట్ చేస్తున్నాడు. తన కెరీర్ 27వ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యతల్ని వంశీ పైడిపల్లికి కట్టబెట్టాడు. మహేష్ ల్యాండ్ మార్క్ 25వ చిత్రం మహర్షి నటుడిగా తనకు మంచి పేరు తెచ్చింది. అందుకే తిరిగి ఈ కాంబినేషన్ రిపీటవుతోంది. అయితే పైడిపల్లి ఈసారి ఓ డిఫరెంట్ జోనర్ కథని ఎంచుకుని మునుపెన్నడు చూడని సరికొత్త మహేష్ ని తెరపై చూడబోతున్నాడన్న ప్రచారం ఇప్పటికే వేడెక్కిస్తోంది.
సూపర్ స్టార్ కృష్ణ మహేష్ ని జేమ్స్ బాండ్ గానో లేదా గ్యాంగ్ స్టర్ గానో చూడాలని భావిస్తున్నారట. అందుకు తగ్గట్టే పైడిపల్లి స్క్రిప్టు రెడీ అయ్యింది. ప్రీప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈసినిమా తర్వాత మహేష్ ఎంబీ 28-ఎంబీ 29- ఎంబీ30 చిత్రాల దర్శకులను కూడా లైన్ లోకి తెచ్చారని ప్రచారం సాగుతోంది. దాదాపు రెండు మూడేళ్ల పాటు మహేష్ ఈ సినిమాలు పూర్తిచేయడానికి సరిపోతుందని చెబుతున్నారు. ఎంబీ 28 చిత్రాన్ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో.. ఎంబీ 29ని అనీల్ రావిపూడితో.. ఎంబీ30 చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నాడుట.
కెరీర్ 28వ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ తో కలిసి జీఎంబీ ప్రొడక్షన్స్ నిర్మించనుంది. మిగతా రెండు సినిమాలకు సంబంధించి నిర్మాణ సంస్థలు ఖరారు కావాల్సి ఉంది. దర్శకుల జాబితాలో అర్జున్ రెడ్డి ఫేం సందీప్ వంగా పేరు లేకపోవడం విశేషం. ఆయనతో సినిమా చేయాలని మహేష్ ఎప్పట్పటి నుంచో అనుకుంటున్నాడు. కానీ స్క్రిప్ట్ కుదరకపోవడంతో సందీప్ ని మహేష్ పూర్తిగా పక్కన పెట్టేశాడనే అర్థమవుతోంది. ఇక వరుసగా మూడు నాలుగు సినిమాల్ని క్యూలోకి తేవడంతో పవన్ అభిమానుల్లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగుతోంది. పవన్ - మహేష్ ఒకరితో ఒకరు పోటీపడి నటిస్తున్నారు కాబట్టి రిలీజ్ క్లాష్ తప్పదు. ఒకరికొకరు ఎదురుపడితే అభిమానుల మధ్య వార్ మొదలైపోవడం ఖాయం. మునుముందు సీన్ ఏమిటో వేచి చూడాల్సిందే.