మహేష్ బాబు తన సినిమాల ప్రమోషన్ విషయంలో అగ్రెసివ్ గా ఉంటాడనే సంగతి తెలిసిందే. ప్రచారం కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా మహేష్ వదిలిపెట్టడు. అయితే.. ఇదంతా కేవలం తెలుగు వెర్షన్ కు మాత్రమే పరిమితం. హిందీ అనో.. ఇంకోటనో ఎప్పుడు ఏ రకమైన ఆవకాశం వచ్చినా మాట దాటేసే తత్వం మహేష్ ది.
కానీ స్పైడర్ విషయంలో ఇవన్నీ మారిపోతున్నాయ్. తన సినిమాను దేశవ్యాప్తంగానే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని ఫిక్స్ అయిపోయాడు. మురుగదాస్ మూవీ కావడంతో హిందీ.. తమిళ్ కూడా ప్లాన్ చేసుకున్న మహేష్.. బాహుబలి పట్టించిన బూస్ట్ తో మరింతగా కన్నేశాడు. ప్రపంచవ్యాప్తంగా ఆయా భాషల్లో సినిమాలకు ఎక్కడెక్కడ మార్కెట్ ఉందో శోధించి మరీ పబ్లిసిటీ చేసుకునేందుకు ప్లాన్ చేయడం విశేషం. మలేషియాలో తమిళ్ సినిమాకు డిమాండ్ ఉంటుంది. అందుకే అక్కడ ఓ ఈవెంట్ లో పాల్గొనబోతున్నాడట.
అలాగే దుబాయ్.. న్యూ జెర్సీలలో కూడా ప్రమోషన్స్ కోసం స్పైడర్ ఈవెంట్స్ ప్లాన్ చేశారు. ఇక దేశవ్యాప్తంగా కూడా పలు నగరాల్లో పబ్లిసిటీ ఈవెంట్స్ నిర్వహించడమే కాదు.. వాటిలో పాల్గొనేందుకు సిద్ధమైపోతున్నాడట మహేష్. తన మార్కెట్ స్టామినా పెంచుకునేందుకు సూపర్ స్టార్ ఇప్పటివరకూ చాలానే చేశాడు కానీ.. ఇలా పక్క రాష్ట్రాలు.. పక్క దేశాలపై కూడా కన్నేసేయడం మాత్రం మహేష్ బాబుకు ఇదే మొదటిసారి.