శ్రీమంతుడా.. ఇక్కడ ఫోకస్ చెయ్యి నానా

Update: 2015-07-27 05:54 GMT
మహేష్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీస్‌ 'శ్రీమంతుడు' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇటీవలే పాటలు, టీజర్లు రిలీజై చక్కని ప్రశంసలు అందుకున్నాయి. పాటలు హిట్టు, సినిమాకి పెద్ద ప్లస్‌ అవుతాయన్న చర్చలు సాగుతున్నాయి. అయితే ఈ సినిమా ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో మాస్‌ ని ఇంకా టచ్‌ చేయనేలేదు. బి,సి కేంద్రాలకు చేరువయ్యేలా సరైన ప్రచారం చేస్తున్నట్టు కనిపించనేలేదు.

అంతేనా బాహుబలిని ఇమ్మిటేట్‌ చేయడానికి శ్రీమంతుడు తెగ ఆరాటపడుతున్నాడన్న విమర్శలొస్తున్నాయి. బాహుబలి ప్రచారం విషయంలో తెలుగు కంటే ఆంగ్ల మీడియా, హిందీ మీడియాకే అత్యధిక ప్రాధాన్యతనిచ్చారు. తెలుగు మీడియాని అస్సలు పట్టించుకోనేలేదన్న విమర్శలొచ్చాయి. అదే తీరుగా ఇప్పుడు శ్రీమంతుడు కూడా కొత్త దారిలో వెళుతున్నాడు. మహేష్‌ అండ్‌ టీమ్‌ ఎక్కువగా ఆంగ్ల మీడియాకే టచ్‌ లో ఉంటున్నాడు. ఇంటర్వ్యూ లు, చిట్‌ చాట్‌ లు అంటూ హడావుడి చేస్తున్నాడు. తెలుగు మీడియా కి ఒక్క ఇంటర్వూ కూడా లేనేలేదింతవరకూ.

ఇలా అయితే బి,సి కేంద్రాల్లో మాస్‌ ఆడియెన్‌ కి వార్త చేరేదెలా? అక్కడికి వెళ్లేది తెలుగు పత్రికలే కదా! అని కొందరు ప్రశ్నిస్తున్నారు. శ్రీమంతుడు ఇలా రాంగ్‌ టర్న్‌ తీసుకున్నాడేంటి? అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌, కోలీవుడ్‌ లో భారీ వసూళ్లు వచ్చినా, ఓవర్సీస్‌ లో డాలర్లు కురిసినా.. ఓ రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాకి ఏపీ, తెలంగాణ లోని మాస్‌ ఆడియెన్‌ నుంచి వచ్చేంత రావడం కష్టం. కాబట్టి ఇకనుంచైనా ఇక్కడ జాగ్రత్త పడితే బావుంటుందేమో!


Tags:    

Similar News