ప్రేక్ష‌కులూ... మ‌హేష్ చెప్పింది విన్నారు క‌దా!

Update: 2015-07-24 05:49 GMT
ఇప్పుడొచ్చే సినిమాల‌కి లాంగ్ ర‌న్ ఉండ‌టం లేదు. పైర‌సీనో, మ‌రొక‌టో మ‌రొక‌టో తెలీదు కానీ... వారం రోజుల్లోనే మొత్తం పెట్టుబ‌డంతా తిరిగొచ్చేయాల‌న్న  ప్లాన్‌ తో మాస్‌ మ‌సాలా సినిమాలు తెర‌కెక్కించ‌డం అల‌వాటు చేసుకొన్నారంతా. దీంతో కొన్ని మంచి క‌థ‌లు మ‌రుగున‌ప‌డిపోతున్నాయి. ఇలాంటి సినిమాలు తీస్తే జ‌నం చూస్తారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అయితే  కొద్దిమంది స్టార్ క‌థానాయ‌కులు, ద‌ర్శ‌కులు మాత్రం ధైర్యం చేసి స‌ద‌రు మంచి సినిమాల్ని తీసేస్తున్నారు. మ‌ళ్లీ మునుప‌టిలా లాంగ్ ర‌న్ సినిమాలు వ‌చ్చేలా ప్ర‌య‌త్నిస్తున్నారు. ఇదొక మంచి ప‌రిణామం అని చెప్పొచ్చు. ఆమ‌ధ్య అల్లు అర్జున్ చేసిన `స‌న్నాఫ్ స‌త్యమూర్తి` ఆ కోవ‌లోకి చెందిందే. ఎప్పుడూ మాస్ సినిమాలు చేసే బ‌న్నీ, త్రివిక్ర‌మ్‌... `స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి`లాంటి ఓ మంచి సినిమాని చేశారు. దీంతో ఓపెనింగ్స్ కాస్త త‌క్కువ అనిపించినా మెల్ల‌గా జ‌నాలు చూడ‌టంతో వ‌సూళ్లు భారీగా వ‌చ్చాయి. ఆ సినిమా గ‌ట్టున ప‌డింది.

ఇప్పుడు మ‌హేష్ చేసిన సినిమా కూడా ఆ త‌ర‌హాకి చెందిందే అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ట్రైల‌ర్ చూస్తేనే ఆ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోంది. మ‌హేష్ ఓ ఇంట‌ర్వ్యూ లోనూ  శ్రీమంతుడు గురించి అదే మాట చెప్పారు. ''మంచి సినిమా చేశాం. జ‌నాలకు ఎక్కాలంతే.  ఇది మాస్ సినిమా కాదు. ఒక్క‌సారి గా వాళ్ల‌కు న‌చ్చేస్తుంద‌ని చెప్ప‌డానికి. ఆ విష‌యంలో  నాకూ కాస్త టెన్ష‌న్ గా ఉంది. కానీ మేం ఎంచుకొన్న క‌థ ప్ర‌తి ఒక్క‌రినీ క‌దిలిస్తుంద‌నే న‌మ్మ‌కం మాత్రం నాకుంది''  అన్నాడు మ‌హేష్. సినిమాపై లేనిపోని అంచ‌నాలు పెంచుకొని నిరుత్సాహ‌ప‌డ‌కుండా మ‌హేష్ ముందుగానే మంచి సినిమా అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. సో... తెలుగు ప్రేక్ష‌కులు మ‌రోసారి ఓ మంచి సినిమా వ‌స్తోంది. చూసి ఆనందించండి మ‌రి!
Tags:    

Similar News