మనిషికి చాలాసార్లు ఏం చేయాలి అనే సందేహం వస్తుంది. ఇలాంటోళ్లందరికీ మహేష్ బాబు ఒక ఫిలాసఫీ చెప్పబోతున్నాడు. యావత్ శ్రీమంతుడు సినిమా మొత్తం ఈ ఫిలాసఫీతోనే నడుస్తుంది. ఇంతకీ ఏంటది?
''మనస్సుకు తోచిందే చేసేయడమే'' అంటూ ముందుకొస్తున్నాడు మహేష్.. అలా అనుకున్నప్పుడే మన లైఫ్‌లో మనం అనుకున్నది సాధించేస్తాం. లేకపోతే సాధించలేం. ఇక సినిమాలో కూడా ఈ డైలాగ్ ను తన తండ్రి జగపతి బాబుతో చెబుతాడు మహేష్. ''మీరు మీకు నచ్చింది చేసి ఎంతో సాధించారుగా నాన్నా.. నన్ను కూడా అలాగే వదిలేయండి.. నాకు నచ్చింది నేను చేస్తా'' అంటూ కోటీశ్వరుడైన తన తండ్రితో చెబుతాడు మహేష్. యావత్ సినిమా ఈ చిన్న సోల్ మీదనే ఆధారపడి ఉంటుందట. ఈ విషయాన్ని స్వయంగా దేవిశ్రీప్రసాద్ రివీల్ చేస్తే.. దానిన వెంటనే మహేష్ బాబు కూడా ఎస్ అంటూ ఒప్పేసుకున్నాడు.