టాలీవుడ్....కోలీవుడ్....ఇలా ఏ `వుడ్ ` అయినా....దక్షిణాదిలో సినీ తారలను తమ ఇలవేల్పులుగా కొలిచే అభిమానులున్నారు. తమకు నచ్చిన హీరో, హీరోయిన్ల కటౌట్లకు పాలాభిషేకాలు చేయించడం మొదలుకొని.....గుళ్లూ గోపురాలు కట్టించడం వరకు.....రకరకాలుగా తమ వీరాభిమానాన్ని చూపిస్తుంటారు. ఆన్ స్క్రీన్ లో తమ అభిమాన నటీనటులు కనబడితేనే ఉత్సాహాన్ని అపుకేలేక ఈలలు - గోలలతో థియేటర్లను హొరెత్తిస్తుంటారు. ఒకవేళ ఆ నటీనటులను ఆఫ్ స్క్రీన్ లో ...అతి దగ్గరగా చూసే అవకాశం వస్తే అసలు వదులుకోరు. అయితే, వ్యక్తిగత కార్యక్రమాల కోసమో - షాప్ ఓపెనింగ్ల కోసమో సినీ తారలు....హాజరైన సందర్భంలో కొన్ని సార్లు అభిమానం హద్దులు దాటుతుంటుంది. తమ ఉత్సాహాన్ని అదుపుచేసుకోలేని కొందరు అభిమానులు....ఆ నటీనటులకు తమకు తెలిసోతెలియకో...ఇబ్బందులు కలిగిస్తుంటారు. గతంలో కొంతమంది హీరోయిన్లను....కొందరు అభిమానులు అసభ్యంగా తాకిన ఘటనలు కూడా ఉన్నాయి. తాజాగా, టాలీవుడ్ సూపర్ స్టార్ - ప్రిన్స్ మహేష్ బాబుకు కూడా తాజాగా ఓ అభిమాని అదే తరహా ఇబ్బందికర అనుభవం ఎదురైంది. అయితే, ఎంతో హుందాగా వ్యవహరించిన ప్రిన్స్ ఆ అభిమానిపై ఏమాత్రం అసహనం ప్రదర్శించకుండా సాఫ్ట్ గా జవాబిచ్చాడు.
చిన్న చిన్న కారణాలతోనే అభిమానులు - అనుచరులపై చేయి చేసుకున్న హీరోల గురించి వార్తల్లో వింటూనే ఉన్నాం. అయితే, సాధారణంగా మహేష్ బాబు ఎవరి మీద పెద్దగా ఆవేశపడిన సందర్భాలు లేవు. ఇంటర్వ్కూలలో, ఆడియో రిలీజ్ ఫంక్షన్ - ప్రీ రిలీజ్ వేడుకలు....ప్రైవేటు కార్యక్రమాలు....ఇలా ఎక్కడకు వెళ్లినా చాలా కూల్ గా వ్యవహరిస్తాడు ప్రిన్స్. అదే తరహాలో తాజాగా ఓ అభిమాని ఇబ్బందికర ప్రవర్తనకు కూడా మహేష్ సంయమనం కోల్పోకుండా కూల్ గా బదులిచ్చాడు. `భరత్ అనే నేను` సక్సెస్ మీట్ లో భాగంగా విజయవాడకు వచ్చిన మహేష్ బాబు కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు గుడికి వెళ్లాడు. అయితే, తమ అభిమాన నటుడు మహేష్ ను అతి సమీపం నుంచి చూసేందుకు యువత, అభిమానులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించినా నియంత్రణ సాధ్యం కాలేదు. దీంతో, కార్లో నుంచి దిగి ఆలయంలోకి వెళ్లబోతున్న మహేష్ బాబు కాలును ఓ అభిమాని తొక్కాడు. దీంతో కాలిని వెనక్కు లాక్కున్న మహేష్ బాబు ‘చూస్కోవాలి కదండీ.. నేనూ మనిషినేనండీ’ అంటూ సున్నితంగా సమాధానమిచ్చి దర్శనానికి వెళ్లిపోయాడు. ఈ ఘటనను చూసిన అభిమానులు మహేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. మహేష్ బాబు మనసు వెన్న వంటిదని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే, హోటల్ కు చేరుకున్న తర్వాత తన కాలికి తగిలిన దెబ్బకు మహేష్ ప్రథమచికిత్స చేయించుకుకున్నాడు. ఆ తర్వాత వేరే కార్యక్రమంలో పాల్గొన్న మహేష్ మీడియాతో మాట్లాడాడు. తన కెరీర్ బెస్ట్ హిట్లయిన ఒక్కడు - పోకిరి - దూకుడు సినిమాల విజయోత్సవాల సందర్భంగా కూడా తాను విజయవాడకు వచ్చాననని మహేష్ అన్నాడు. అంతేకాకుండా, ఇకపై ప్రతి సినిమా విడుదలకు విజయవాడకు రావాలనుందని మహేష్ అన్నాడు.