మోడీ నిర్ణయంపై మహేష్ స్పందన!

Update: 2016-11-11 03:35 GMT
చాలా అరుదుగా సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు. మొన్నటికి మొన్న తాను దత్తత తీసుకున్న గ్రామాన్ని తన బావ గల్లా జయదేవ్ తన ఎంపీ నిధులతో సూపర్ గా మార్చారని, థ్యాంక్స్ చెబుతూ ఫేస్ బుక్ లో ఫోటోలు పెట్టి పోస్ట్ చేశారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న పెద్దనోట్ల రద్దు నిర్ణయంపై ప్రిన్స్ స్పందించారు. మోడీ నిర్ణయంవల్ల సినిమావాళ్లకు మామూలు దెబ్బకాదని కొందరంటుంటే... పలువురు సినీ ప్రముఖులు - టాలీవుడ్ హీరోలు కూడా మోడీ నిర్ణయంపై అభినందించినవారిలో ఉన్నారు. దీంతో మహేష్ బాబు స్పందించడం ఆసక్తిని కలిగిస్తొంది.

ఈ విషయాలపై నిర్మాతగా, భారీ రెమ్యునరేషన్స్ తీసుకునే స్టార్ హోదాలో ఉన్న మహేష్ ఈ విషయంపై ఎలా స్పందిస్తారా అని భావించిన వారికి ఉన్న సందేహాలను మహేష్ ఒక్క ట్వీట్ తో క్లారిటీ ఇచ్చేశారు. "దేశానికి, దేశ ఆర్ధిక వ్యవస్థకు ఒక ఆహ్లాదకరమైన మార్పును తీసుకువచ్చారు.. ప్రజల మనిషి - ప్రజల కొరకు - ప్రజల చేత ఎన్నుకోబడిన నరేంద్ర మోడీ గారు ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు సెల్యూట్" అంటూ లేటుగా ఇచ్చినా, లేటెస్ట్ గా స్పందించాడు.

ఇలా ఎవరూ ఊహించని విధంగా మహేష్ పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించి అభిమానులను కూడా ఆశ్చర్యపరిచారు. ఒక విధంగా మోడీ చేసిన ప్రకటన దేశం మొత్తాన్ని ఎంత షాక్ కు గురిచేసిందో, మహేష్ చేసిన ట్వీట్ కూడా అభిమానులను అంతే ఆశ్చర్యానికి గురి చేసిందిని చెప్పొచ్చు. ఈ ట్వీట్ తో నల్లదనం పై మహేష్ తనకున్న అభిప్రాయాన్ని చెప్పినట్లే కదా!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News