‘‘సినిమాల్లో నటించడం అంటే ఆషామాషీ వ్యవహారంగా భావిస్తారు. కానీ నటన చాలా ఒత్తిడితో కూడిన పని. ఈ ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలామంది నలిగిపోతుంటారు. ఈ ఒత్తిడి నుంచి బయటపడటానికి ఫ్యామిలీ చక్కటి మందు. ఆ విషయంలో నేను చాలా లక్కీ’’ అంటున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. సినిమాలు - వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని.. అదే తనకు ఆనందాన్ని ఇస్తుందని చెబుతున్నాడీ అందగాడు.
మురగదాస్ డైరెక్షన్ లో మహేష్ నటించిన స్పైడర్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్లలో మాట్లాడుతూ మహేష్ తన వ్యక్తిగత ప్రాధాన్యాల గురించి కూడా చెప్పుకొచ్చాడు. అందులో ఫ్యామిలీయే ముందు ఉందంటున్నాడు. ప్రస్తుత జనరేషన్ హీరోల్లో ఎన్టీఆర్ - రానాతోపాటు ముందు తరం హీరోలు నాగార్జున - చిరంజీవి కూడా సినిమాలు చేస్తూనే టీవీషోలు కూడా చేస్తూ వస్తున్నారు. ఇదే విషయం మహేష్ వద్ద ప్రస్తావిస్తే ‘‘నాకు సినిమాలతోనే టైం సరిపోతోంది. ఒకవేళ ఖాళీ సమయం దొరికితే ఫ్యామిలీకి పిల్లలకు కేటాయిస్తాను. వాళ్ల ఓపికను మెచ్చుకుంటాను. నేను వాళ్లంత టైం కేటాయించలేను. నటన కాకుండా నాకు వేరే జీవితం ఉంది.’’ అంటూ స్పష్టంగా చెప్పేశాడు. ‘పెద్ద సినిమాలు చేశామంటే అందులో ఇన్వాల్వ్ అయిన వారందరిపైనా విపరీతమైన ఒత్తిడి ఉంటుంది. సినిమా సక్సెస్ కోసం అందరం ఎంతో శ్రమిస్తాం. రిలీజ్ టైం వచ్చేసరికి అందరిలోనూ ఎక్సయిట్ మెంట్ తోపాటు ఒకరకమైన నెర్వస్ కూడా వస్తుంది. నాకు అలా అనినిపించినప్పడు నా ఫ్యామిలీయే నాకు అండగా ఉంటుంది’ అంటున్నాడు.
‘‘మా అబ్బాయి గౌతమ్ 11 ఏళ్లవాడయ్యాడు. వీడియో గేమ్ లు ఆడటం నేర్చుకున్నాడు. అమ్మాయి సితారకు ఐదేళ్లొచ్చాయి. బొమ్మలతో ఆడుకుంటోంది. వాళ్లిద్దరికీ నాతో సమయం గడపడమంటే ఇష్టం. తరచూ వాళ్లతో కలిసి హాలీడేలకు వెళ్తుంటాను. షూటింగుల్లో బిజీగా ఉన్నావారితో సమయం గడుపుతుంటా. పిల్లల జీవితంలో ఇంపార్టెంట్ ఈవెంట్ ఏదీ మిస్సవ్వబోను’’ అంటూ మహేష్ తన ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్పుకొచ్చాడు.