సర్కారు వారి ట్రైలర్: ఇది కదా మహేష్ మెంటల్ మాస్ స్వాగ్ అంటే..!

Update: 2022-05-02 10:40 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ''సర్కారు వారి పాట''. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మే 12న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ చేయబడిన 'సర్కారు వారి పాట' ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు రెట్టింపు చేసింది. ఈ క్రమంలో అభిమానులను మరింత ఉత్సాహ పరచడానికి ఈరోజు సోమవారం సాయంత్రం కూకట్ పల్లి మాస్ థియేటర్ భ్రమరాంబ 70 ఎంఎంలో ట్రైలర్ ను లాంచ్ చేశారు.

'నా ప్రేమను దొంగిలించగలవ్.. నా స్నేహాన్నీ దొంగిలించగలవ్.. కానీ నువ్వు నా డబ్బుని మాత్రం దొగించలేవ్' అంటూ మహేష్ బాబు తెలుగు ఇంగ్లీష్ మిక్స్ చేసి చెప్పిన డైలాగ్ తో SVP ట్రైలర్ ప్రారంభమవుతుంది. ముందు నుంచీ చెప్తున్నట్లుగానే మహేష్ సరికొత్త అవతార్ లో కనిపించి ఆకట్టుకున్నారు.

వింటేజ్ మహేష్ ను గుర్తుకు తెచ్చేలా ఇందులో హీరో క్యారెక్టరైజేషన్ ఉంది. బాడీ లాంగ్వేజ్ - డైలాగ్ డెలివరీ కొత్తగా ఉన్నాయి. 'పోకిరి' 'బిజినెస్ మ్యాన్' సినిమాల టైం లో సూపర్ స్టార్ ని గుర్తు చేస్తున్నాయి. స్క్రీన్ పై ఇంతకముందు కంటే మరింత హ్యాండ్సమ్‌ గా కనిపించారు. అలానే యాక్షన్ మోడ్ లోనూ ఇరగదేశాడు. ఇది

'అమ్మాయిలను అప్పు ఇచ్చేవాళ్లను పాంపర్ చేయాలిరా.. రఫ్ గా హ్యాండిల్ చేయకూడదు' అనే డైలాగ్.. ఏపీ సీఎం జగన్ స్టైల్ లో 'నేను విన్నాను.. నేను వున్నాను..' అని చెప్పడం.. 'దీనెమ్మ మెయింటైన్ చేయలేక దూల తీరిపోతోంది' 'దిస్ ఈజ్ మహేష్.. రిపోర్టింగ్ ఫ్రమ్ చేపలపూడి బీచ్ సర్' అని మహేష్ తనదైన శైలిలో పలికే సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి.

సర్కారు వారి పాటలో లవ్ యాంగిల్ మరియు కామెడీ ట్రాక్ ని కూడా చూపించారు. మహేష్ - హీరోయిన్ కీర్తి సురేష్ జంట చాలా ఫ్రెష్ గా ఉంది. వీరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. వెన్నెల కిశోర్ - మహేష్ మధ్య వచ్చే సన్నివేశాలు నవ్విస్తున్నాయి.

అలానే మహేష్ మెంటల్ మాస్ స్వాగ్ తో పాటుగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కోరుకునే ఊర మాస్ యాక్షన్ ఫైట్స్ ను ఈ ట్రైలర్ లో జోడించారు. ఇక్కడ సముద్ర ఖని విలన్ గా కనిపిస్తున్నారు. 'అప్పు అనేది ఆడ పిల్లల లాంటిది.. ఇక్కడ ఎవరూ బాధ్యత గల ఆడ పిల్ల తండ్రిలా బిహేవ్ చేయడం లేదు' అని మహేష్ అంటుంటే.. 'నా దృష్టిలో అప్పు అంటే సెటప్ లాంటిది' అని సముద్ర ఖని అంటున్నారు.

ట్రైలర్ లోసర్కారు వారి పాట నేపథ్యం రివీల్ చేయనప్పటికీ.. మహేశ్ ఇందులో అప్పుకు డబ్బులు ఇచ్చి వసూలు చేసే కంపెనీ నిర్వహిస్తారని అర్థం అవుతోంది. నదియా - సుబ్బరాజు - తనికెళ్ళ భరణి - పోసాని కృష్ణ మురళి - మహేష్ మంజ్రేకర్ తదితరులు ఈ ట్రైలర్ భాగమయ్యారు.

లవ్, కామెడీ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలు ఉండేలా ట్రైలర్ కట్ చేయడాన్ని బట్టి చూస్తుంటే 'సర్కారు వారి పాట' సినిమా పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని అర్థం అవుతుంది. ఇది మహేష్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చే ట్రైలర్ అని చెప్పొచ్చు. అలానే సమ్మర్ సీజన్ కు పర్ఫెక్ట్ మూవీలా అనిపిస్తుంది.

మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ - సినిమాటోగ్రాఫర్ ఆర్. మది విజువల్స్ అదనపు ఆకర్షణగా నిలిచాయి. నిర్మాణ విలువలు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. ఏఎస్ ప్రకాష్ ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫైట్స్ కంపోజ్ చేశారు.

'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్టైన్మెంట్ - 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట - గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించారు. హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న మహేష్ కు.. SVP ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


Full View
Tags:    

Similar News