మహేష్ వర్సెస్ మహేష్! ఇదివరకెన్నడూ చూడని అరుదైన దృశ్యమిది. హైదరాబాద్ గచ్చిబౌళిలోని ఏఎంబీ సినిమాస్ ప్రాంగణంలో సూపర్ స్టార్ మహేష్ మైనపు విగ్రహాన్ని మ్యాడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు ఆవిష్కరించారు. ప్రస్తుతం ఈ విగ్రహం అహూతుల్ని అలరిస్తోంది. ఈ విగ్రహాన్ని మహేష్ తో కలిసి నమ్రత- గౌతమ్ - సితార బృందం రిబ్బన్ కట్ చేసి ఆవిష్కరించారు. దాదాపు 100 మంది మీడియా ప్రతినిధులు .. భారీగా మహేష్ అభిమానుల సమక్షంలో ఈ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఎంబీ మాల్ లో సందడి వాతావరణం నెలకొంది. అలాగే ఈ కార్యక్రమంలో సింగపూర్ మ్యాడమ్ టుస్సాడ్స్ నిర్వాహకులు పాల్గొన్నారు. మహేష్ మైనపు విగ్రహాన్ని వీక్షించేందుకు అసలు రెండు కళ్లు సరిపోవు అంటూ వ్యాఖ్యానించారంతా. ఇక ఈ వేదిక వద్ద మహేష్ పై మీడియా ఫ్లాష్ లు మిరుమిట్లు గొలిపాయి. మహేష్ తన మైనపు విగ్రహం చెంతకు వెళ్లి ఓ సెల్ఫీ తీసుకోవడం అభిమానులకు కన్నుల పండువగా కనిపించింది. ఇన్నాళ్లు మహేష్ తో సెల్ఫీ కోసం ఎగబడ్డారంతా. అలాంటిది సూపర్ స్టారే స్వయంగా ఆ విగ్రహంతో సెల్ఫీ దిగడం చర్చకు వచ్చింది. ఇక మహేష్ అభిమానులంతా దూరం నుంచే ఆ విగ్రహంతో సెల్ఫీలు దిగే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఆ సెల్ఫీ ఫోటోలు మహేష్ అభిమానుల సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతున్నాయి. పూర్తి నల్ల రంగు సూట్ లో ఉన్న విగ్రహం చెంత దానికి పూర్తి ఆపోజిట్ పింక్ కలర్ డ్రెస్ లో మహేష్ కనిపించడం ఆసక్తికరం.
ఈరోజు అంతా ఏఎంబీ మాల్ లో ఈ మైనపు విగ్రహాన్ని సందర్శకుల కోసం ఉంచుతారు. అటుపై డైరెక్టుగా సింగపూర్ కి ఈ విగ్రహాన్ని తరలించనున్నారు. బాహుబలి ప్రభాస్ విగ్రహాన్ని ఇదివరకూ బ్యాంకాక్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. అదే విగ్రహాన్ని లండన్ లోనూ ఆవిష్కరిస్తున్నామని మ్యాడమ్ టుస్సాడ్స్ ప్రకటించింది. ఇప్పుడు మహేష్ విగ్రహాన్ని సింగపూర్ టుస్సాడ్స్ లో పబ్లిక్ కోసం ఆవిష్కరిస్తున్నారు. మ్యాడమ్ టుస్సాడ్స్ లో తొలి సౌత్ హీరోగా ప్రభాస్ రికార్డులకెక్కితే, ఆ తర్వాత మహేష్ కి ఆ ఖ్యాతి దక్కింది. ఇద్దరు తెలుగు హీరోల విగ్రహాల్ని మ్యాడమ్ టుస్సాడ్స్ లో ఆవిష్కరించడం ఆసక్తికరం.