చిత్రం- శ్రీమంతుడు
రేటింగ్- 3.25/5
నటీనటులు- మహేష్ బాబు - శ్రుతి హాసన్ - జగపతి బాబు - రాజేంద్ర పసాద్ - ముఖేష్ రుషి - సంపత్ - హరీష్ ఉత్తమన్- వెన్నెల కిషోర్- రాహుల్ రవీంద్రన్ - ఆలీ - సుకన్య - తులసి - ఏడిద శ్రీరామ్ - సురేఖా వాణి - సుబ్బరాజు తదితరులు
సంగీతం- దేవిశ్రీ ప్రసాద్
ఛాయాగ్రహణం- మధి
నిర్మాతలు- నవీన్, రవికిశోర్ - మోహన్
రచన, దర్శకత్వం- కొరటాల శివ
సినిమాల్లో సందేశాలిస్తే, మంచి చెబితే చూసే వాళ్లెవరున్నారని అనుకుంటాం. కానీ బాలీవుడ్ లో రాజ్ కుమార్ హిరాని విలువల పాఠాలు బోధిస్తే భాష అర్థం కాకున్నా ఎగబడి చూస్తాం. అలాగని 'మంచి' చెప్పిన ప్రతి సినిమానూ చూసేయం. ఆ చెప్పే విధానాన్ని బట్టి.. అందులోని కథానాయకుడిని బట్టి.. ఆ సినిమా వేసే ఆకర్షణ మంత్రాన్ని బట్టి.. ఆ పాఠం మనకు ఎక్కుతుంది. హిరాని నుంచి స్ఫూర్తి పొందాడో ఏంటో కానీ.. మన కొరటాల శివ ఓ మంచి విలువలున్న సినిమాతో మన ముందుకొచ్చాడు. హిరానికి అమీర్ దొరికినట్లే శివకు మహేష్ రూపంలో ఓ ఆణిముత్యం దొరికాడు. ఇంకేముంది.. కొరటాల ఆలోచనలు మరింత అందంగా తెరమీదికి వచ్చాయి. కమర్షియల్ రుచులకు ఎక్కడా లోటు లేకుండా కొరటాల అందించిన 'మంచి' సినిమా 'శ్రీమంతుడు' విశేషాల్లోకి వెళ్దాం పదండి.
కథ:
హర్ష (మహేష్ బాబు) పాతిక వేల కోట్ల ఆస్తికి వారసుడు. అతడి తండ్రి రవికాంత్ (జగపతి)కు కొడుకు తన వ్యాపారాన్ని వారసత్వంగా స్వీకరించాలని కోరిక. కానీ హర్షకు వ్యాపారం మీద ఆసక్తి ఉండదు. కష్టంలో ఉన్న మనిషిని ఆదుకోవాలనే తాపత్రయం అతడిది. ఇలాంటి పరిస్థితుల్లో హర్షకు చారుశీల (శ్రుతి హాసన్)తో పరిచయమవుతుంది. ఆమెను ప్రేమిస్తాడు. చారుశీల ద్వారా తన తండ్రి గతం గురించి కొన్ని నిజాలు తెలుసుకున్న హర్ష.. ఉత్తరాంధ్రలోని దేవరకోట అనే గ్రామానికి వెళ్తాడు. ఇంతకీ ఆ గ్రామంతో రవికాంత్ కు సంబంధమేంటి? ఆ ఊరికెళ్లి హర్ష ఏం చేశాడు? అతడికి అక్కడ ఎదురైన ఆటంకాలేంటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? చివరికి అతనేం సాధించాడు? అన్న సంగతులు తెరమీదే చూడాలి.
కథనం, విశ్లేషణ:
ఉపోద్ఘాతంలో సినిమా, విలువలున్న సినిమా అంటుంటే మళ్లీ ఇదేదో గొప్ప సందేశాత్మక చిత్రమని కంగారు పడాల్సిన పని లేదు. అభిమానుల రోమాలు నిక్కబొడుచుకునే హీరోయిజం ఉంది. ఆహ్లాదం పంచే అందమైన జంట ప్రేమాయణం ఉంది.. గుండె బరువెక్కించే సెంటిమెంటూ ఉంది. కమర్షియల్ లెక్కలన్నీ తూకం వేసి మరీ నింపాడు కొరటాల. ఎవరికి ఏది కావాలిస్తే అది ఏరుకోవచ్చు.
కొరటాల శివ తొలి సినిమాతోనే తన శైలి ఏంటో చెప్పేశాడు. మిర్చి కొత్త కథేమీ కాదు. కథనంలో కూడా మనం ఊహించలేని మలుపులేమీ లేవు. కానీ ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకుడిని 'కన్విన్స్' చేయడంలో తన ప్రత్యేకత చూపించాడు కొరటాల. 'శ్రీమంతుడు' కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. కథేంటో ట్రైలర్లోనే చెప్పేశాడు. ఇక సినిమా చూస్తున్నంత సేపూ కూడా తర్వాత ఏం జరుగుతుందో ఊహించడం పెద్ద కష్టమేమీ కాదు. ఐతే హీరో క్యారెక్టరైజేషనేంటో తొలి సన్నివేశంలో అర్థమైపోతుంది కాబట్టి.. ఆ తర్వాత హీరోయిన్ తో పరిచయం.. ఆపై అతనో గ్రామానికి వెళ్లడం.. మంచి పనులు చేయడం.. అడ్డొచ్చిన విలన్లను ఇరగదీయడం.. ఇలా కథ సాగుతుందని ప్రేక్షకులు ఈజీగా చెప్పేయగలరు. ఐతే ఇలా మనం అంచనా వేయగలిగిన కథనే.. ఆహ్లాదకరమైన కథనంతో.. మాటతో, దృశ్యంతో మనల్ని కన్విన్స్ చేస్తూ.. కొన్నిసార్లు ''ఈ సీన్ కొంచెం వెనక్కి వెళ్లి మళ్లీ వస్తే బావుణ్నే'' అనే ఫీలింగ్ తెప్పిస్తూ రెండు ముప్పావు గంటల పాటు బోర్ కొట్టించకుండా సినిమాను నడిపించాడు కొరటాల.
సింపుల్ బట్ బ్యూటిఫుల్.. శ్రీమంతుడికి ఈ క్యాప్షన్ చక్కగా సరిపోతుందేమో. ఎందుకంటే హీరో పరిచయ సన్నివేశాల నుంచి క్లైమాక్స్ వరకు ప్రతి ఎపిసోడ్ లోనూ మెజారిటీ ఆడియన్స్ కు ఇదే ఫీలింగ్ కలుగుతుంది. హీరో పరిచయ సన్నివేశాలతో పాటు హీరోయిన్ తో రొమాంటిక్ ట్రాక్ నుంచి చాలా సింపుల్ గా, ఆహ్లాదకరంగా నడుస్తుంది. ఐతే ప్రథమార్ధం వరకు ఊరికి సంబంధించిన సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా ఏమీ అనిపించవు. ఐతే వెంటనే సీరియస్ గా కథలోకి దిగకుండా ప్రథమార్ధాన్ని సరదాగా నడిపించడం కోసం రొమాంటిక్ ట్రాక్ ను వాడుకున్న దర్శకుడు.. ఇంటర్వెల్ పాయింట్ దగ్గర.. హీరోను కదన రంగంలోకి దించాడు. ఇంటర్వెల్ ఫైట్ తో సినిమాను యాక్షన్ మోడ్ లోకి తీసుకొచ్చి.. మహేష్ మార్కు కొసమెరుపుతో ప్రథమార్ధాన్ని ఆసక్తికరంగా ముగించాడు. ద్వితీయార్ధం నేపథ్యాన్ని ఊరికి షిఫ్ట్ చేసి ఎమోషన్స్ మీద నడిపించాడు.
ఊరిని బాగు చేసే సన్నివేశాలు మామూలే కానీ.. ఎక్కడా ఎమోషన్ మిస్సవకుండా చూసుకోవడంతో కథనం ఎక్కడా ఆగదు. బండి కొంచెం నెమ్మదిస్తున్న సమయంలో ఊరు వదిలి వెళ్లిపోబోతున్న హీరోయిన్ పిన్నికి హీరో జ్నానోదయం కలిగించే సన్నివేశంలో స్ట్రాంగ్ ఎమోషన్ తో కొట్టాడు కొరటాల. సినిమాకు మేజర్ హైలైట్లలో ఒకటనదగ్గ సన్నివేశమిది. పట్నం మోజుతో పల్లెటూరిని వదిలితే ఏం కోల్పోతామో చెబుతూ రాసిన డైలాగులు సింప్లీ సూపర్బ్. చాలా షార్ప్ గా, ఎఫెక్టివ్ గా ఉండే డైలాగులతో ఈ సన్నివేశాన్ని రక్తికట్టించాడు దర్శకుడు. ఈ సన్నివేశంలో సెంటిమెంటు పండితే.. ఆ తర్వాత మామిడి తోట సీన్లో యాక్షన్ మాస్ ఆడయిన్స్ ని ఉర్రూతలూగిస్తుంది.
ప్రి క్లైమాక్స్ లో హీరోలోని సంఘర్షణను బయటపెట్టే సన్నివేశంలో సినిమాకు మరో ప్రధాన ఆకర్షణ. కొరటాల రాసిన అద్భుతమైన మాటలు, మహేష్ నటన ఆ సన్నివేశం చూసిన ఎవరికైనా కళ్లు చెమర్చేలా చేస్తాయి. తెలుగు సినిమాల్లో ఇది చాలా అరుదైన 'మంచి' సన్నివేశం అని చెప్పాలి. ఓ స్టార్ హీరో కమర్షియల్ సినిమాలో ఇలాంటి సన్నివేశం, ఇలాంటి క్యారెక్టరైజేషన్ అస్సలు ఊహించలేం. ఇక్కడికే దాదాపుగా సినిమా అయిపోయినా.. మళ్లీ విలన్లను అలా వదిలేస్తే మాస్ ఆడియన్స్ ఒప్పుకోరని.. వాళ్లను హీరోతో చంపించి సినిమాకు కమర్షియల్ ముగింపునిచ్చారు. ఇలా సినిమా అంతా కూడా ఎక్కడికక్కడ 'కమర్షియల్' కొలతల్లో తేడా రాకుండా చూసుకోవడం ద్వారా తన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకూ చేరువయ్యేలా చూసుకున్నాడు దర్శకుడు. సినిమాలో కామెడీ ట్రాకులంటూ ఏమీ లేవు. ఆలీ, వెన్నెల కిషోర్ లాంటి వాళ్లున్నా వాళ్లు పెద్దగా కామెడీ పండించిందేమీ లేదు. కానీ హీరో క్యారెక్టరైజేషన్, మహేష్ టైమింగ్ కలిసి ప్రతి సన్నివేశంలోనూ మాగ్జిమం ఎంటర్టైన్మెంట్ పండింది. విలన్లు ఎదురైనపుడు వాళ్లతో జరిగే సంభాషణ అయినా.. వాళ్లతో జరిగే ఫైటింగులైనా.. ఎంటర్టైన్మెంట్ మిస్సవలేదు.
సినిమా అంతా ప్రెడిక్టబుల్ గా ఉండటం.. నిడివి కాస్త ఎక్కువ కావడం.. ముందే సినిమాను ముగించే అవకాశమున్నా.. చివర్లో కొంచెం సాగదీయడం.. 'శ్రీమంతుడు'లో చెప్పుకోదగ్గ మైనస్ లు. ఐతే అవేమీ పెద్ద కంప్లైంట్స్ అయితే కావు. సినిమాలో ఉన్న పాజిటివ్స్ తో పోలిస్తే వీటిని ఈజీగా ఇగ్నోర్ చేయొచ్చు.
నటీనటులు:
మహేష్ నటన గురించి చెప్పేదేముంది? ఆ సన్నివేశం ఈ సన్నివేశం అని కాదు కానీ మొత్తంగా అదరగొట్టేశాడు. ప్రి క్లైమాక్స్ లో ''నాలోంచి ఊరిని తీసేయలేకపోతున్నారు" అనే డైలాగ్ చెబుతూ ఎమోషన్ ని పీక్స్ కి తీసుకెళ్లిన ఒక్క సన్నివేశం చాలు మహేష్ ఎంత మంచి పెర్ఫామెరో చెప్పడానికి. నిస్సందేహంగా మహేష్ కెరీర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫామెన్స్. ఇక అభిమానుల్ని ఏ ఏ సన్నివేశంలో, ఏఏ డైలాగుతో అలరించాడో చెప్పాలంటే చాంతాడంత లిస్టు తయారవుతుంది. స్టేట్మెంట్ రొటీన్ అనిపిస్తుందేమో కానీ.. మహేష్ గ్లామర్ 'శ్రీమంతుడు'లో మరింత పెరిగింది. శ్రీమంతుడు అనే టైటిల్ కు వంద శాతం న్యాయం చేశాడు మహేష్. హీరోయిన్ శ్రుతి ఇటు గ్లామర్ తో, అటు పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. హీరో ప్రేమను తిరస్కరించే సీన్లో, ప్రిక్లైమాక్స్ లో ఆమె బాగా చేసింది. ఐతే మహేష్ పక్కన శ్రుతి బాగానే కుదిరింది. అందంలో మహేష్ డామినేట్ చేసినా.. డ్యాన్సుల్లో మాత్రం శ్రుతి అదరగొట్టింది. చారుశీల, దిమ్మదిరిగే పాటల్లో అయితే శ్రుతి మెస్మరైజ్ చేసింది. మిగతా పాత్రధారుల్లో జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్ తమ స్థాయికి తగ్గట్లు పెర్ఫామ్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ చాన్నాళ్ల తర్వాత నిండైన పాత్రలో కనిపించారు. జగపతి బాబు క్యారెక్టర్లో వేరియషన్స్ బాగా చూపించాడు. హాస్పిటల్ సీన్లో ఆయన నటన బాగుంది. జగపతి గెటప్ కూడా ఆకట్టుకుంటుంది. విలన్ రోల్స్ చేసిన ముఖేష్ రుషి, సంపత్, హరీష్ ఉత్తమన్ ఓకే. అన్నింట్లోకి సుబ్బరాజు, సుకన్యల పాత్రలకే పెద్దగా వాల్యూ లేకపోయింది. రాహుల్ రవీంద్రన్ ది కూడా చెప్పుకోదగ్గ పాత్రేమీ కాదు.
సాంకేతిక వర్గం:
టెక్నీషియన్స్ లో ముందు ప్రస్తావించాల్సింది సినిమాటోగ్రాఫర్ మధి గురించి. దర్శకుడి ఆలోచనలకు తగ్గట్లుగా తెరమీద ఆహ్లాదాన్ని నింపడంలో.. ఓ మూడ్ క్రియేట్ చేయడంలో మధి కెమెరా కీలక పాత్ర పోషించింది. తెరను అతను రంగుల మయం చేశాడు. కంటికి ఎంతో ఇంపుగా ఉండే కెమెరా పనితనంతో ఆద్యంతం ఆకట్టుకున్నాడు. పాటల్లో మధి కెమెరా పనితనానికి తోడు ఆర్ట్ డైరెక్టర్ ప్రకాశ్ ప్రతిభ కూడా తోడై ప్రతి పాటా చాలా రిచ్ గా, కలర్ ఫుల్ గా కనిపించింది. ఇక దేవిశ్రీ కూడా తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేశాడు. పాటలన్నీ వినడానికి, చూడటానికి బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో గత సినిమాలతో పోలిస్తే లౌడ్ నెస్ తగ్గించాడు దేవి. దర్శకుడి టేస్టుకు తగ్గట్లు ఈ విషయంలో అండర్ ప్లే చేయడానికి ప్రయత్నించాడు. ద్వితీయార్ధంలో ఎమోషనల్, యాక్షన్ సీన్స్ లో అతడి ఆర్.ఆర్. పనితనం కనిపిస్తుంది. నిర్మాతలు కొత్త వాళ్లయినా ఎక్కడా రాజీ పడలేదు. మహేష్ గత సినిమాలకు ఏమాత్రం తీసిపోని రీతిలో స్టాండర్డ్ మెయింటైన్ చేశారు. ఇక కొరటాల రచనలోనూ, దర్శకత్వంలోనూ 'మిర్చి' నుంచి ఎన్నో మెట్లు ఎక్కాడు. తన 'సింపుల్ అండ్ బ్యూటిఫుల్' శైలికి మరింతగా పదును పెట్టుకుని హార్డ్ హిట్టింగ్ ఎమోషన్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆడియన్స్ ను ఆద్యంతం అలరించాడతను. ఒక ఉదాత్తమైన కథాంశాన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కలిపి అతను చెప్పిన తీరు.. అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంటుంది. అతడి డైలాగ్స్ కూడా చాలా సింపుల్ గానే ఉంటూ ఆకట్టుకున్నాయి.
చివరగా:
శ్రీమంతుడి దగ్గర ఇవ్వడానికి చాలా ఉంది. ఎవరికేం కావాలన్నా ఇస్తాడు. వెళ్లి కావాల్సింది తీసుకోవడమే.
Disclaimer : This Review is an Opinion of Review Writer. Please Do not Judge the Movie based on This Review and Watch Movie in Theatre