ఎంత ఎక్కువ ప్రచారం జరిగితే అంత ఎక్కువ ఓపెనింగ్స్ వస్తాయన్న మాట వాస్తవమే. కానీ కొన్నిసార్లు అతి ప్రచారం కూడా చేటే చేస్తుంది. ప్రేక్షకులు మరీ భారీ అంచనాలతో వచ్చి.. తెరమీద ఏమాత్రం బొమ్మ ఆ అంచనాలకు తగ్గట్లు లేకుంటే సినిమాను తిప్పికొట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. మహేష్ బాబు కెరీర్లో ఇలాంటి చేదు అనుభవాలు చాలానే ఉన్నాయి. బాబి, నాని, సైనికుడు, ఖలేజా లాంటి సినిమాలతో తల బొప్పి కట్టించుకున్నాడు మహేష్. మధ్యలో పుంజుకుని వరుస హిట్లు కొట్టినా.. గత రెండు సినిమాల విషయంలో మళ్లీ ఒకప్పట్లాగే బోల్తా కొట్టాడు.
1 నేనొక్కడినే, ఆగడు సినిమాల విషయంలో అతి ప్రచారమే చేటు చేసింది. 1 సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ అనే సంగతి ముందు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు. ప్రేక్షకులు మరో రకంగా అంచనాలతో సినిమాకు వస్తే తెరమీద వేరే బొమ్మ కనిపించింది. ఆ తర్వాత ఆగడు విషయంలో ప్రచారం బాగా ఎక్కువైంది. ట్రైలర్ తో అంచనాలు మరీ పెంచేశారు. ఎంటర్-టైన్మెంట్ మరీ ఎక్కువ ఆశించారు ప్రేక్షకులు. ఐతే బొమ్మ రొటీన్ గా ఉండటం, వినోదం పండకపోవడంతో దెబ్బ పడిపోయింది. అందుకే శ్రీమంతుడు విషయంలో కొంచెం స్లోగా ఉన్నాడు మహేష్. ట్రైలర్ చూస్తే మరీ అంచనాలు పెంచేలాగా ఏమీ లేదు. సింపుల్ గా ఉంది, బాగుంది అనిపించింది కానీ.. అభిమానులు పూనకం తెచ్చుకునేలా లేదు. ప్రమోషన్ కూడా ఆచి తూచి చేస్తున్నారు. తన సినిమా అంటే ఆటోమేటిగ్గా క్రేజ్ వచ్చేస్తుంది కాబట్టి అనవసర హైప్ తేవొద్దన్న ప్లాన్ తో వెళ్తున్నట్లు కనిపిస్తోంది మహేష్ స్ట్రాటజీ.