వింత అనుభవం ఎదురైంది ప్రిన్స్ మహేశ్ బాబుకు. తాజాగా ఆయన అపరెల్స్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. హంబుల్ బ్రాండ్ పేరుతో ఉత్పత్తుల్ని మార్కెట్లోకి తీసుకురానున్నారు. ఈ లోగోను అనౌన్స్ చేసే ప్రోగ్రాంను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. దీనికి ఒక అభిమాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ ను ప్రశ్న వేసే అవకాశం ఆమెకు దక్కింది.
తన పేరు నేహారాణి అని.. తన భర్త పేరు అశోక్ అని.. అయితే తన భర్తను నేను మహేశ్ అని పిలుస్తానని.. అతను తనను నమ్రత అని పిలుస్తారని చెప్పారు. ఎందుకంటే.. తన భర్త మీకు పెద్ద ఫ్యాన్ అని.. తనను పెళ్లాడటానికి కారణం మీరు మహారాష్ట్ర అమ్మాయిని పెళ్లి చేసుకోవటమేనని.. తాను కూడా మహారాష్ట్ర అమ్మాయినని చెప్పారు. అప్పటివరకూ అందరూ ఆసక్తిగా ఆమె మాటలు వింటున్న వారంతా ఒక్కసారిగా పడి పడి నవ్వారు. ఆ సమయంలో మహేశ్ ముఖం కూడా కందిపోయింది. విపరీతంగా నవ్వటంతో పాటు.. ఇలాంటి అభిమానులు కూడా ఉంటారన్నట్లుగా ఆయన ముఖంలో ఎక్స్ ప్రెషన్ కనిపించింది.
ఇంతకీ ఆవిడ అడిగిన ప్రశ్న ఏమంటే.. నమ్రత మీకు ఎలాంటి షర్ట్స్ తరచూ ఇస్తుంటారని అడగ్గా.. బ్లూ చెక్స్ షర్ట్స్ ఇస్తారని చెప్పారు. ఇక నుంచి తన భర్తకు కూడా తాను బ్లూ కలర్ చెక్స్ ఉన్న షర్ట్ ఇవ్వనున్నట్లుగా చెప్పుకొచ్చారు. వీరాభిమానులు ఉంటారంటారు కానీ.. ఈ స్థాయిలో అన్నది మాత్రం కలలో కూడా ఊహించలేమని చెప్పాలి.
Full View