ఎట్టకేలకు మహేష్ 27 అధికారిక ప్రకటన వచ్చేసింది...!

Update: 2020-05-30 14:00 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణం వచ్చేసింది. నాలుగున్నర నెలల నుండి ఊరించి ఊరించి మహేష్ బాబు తన కెరీర్లో 27వ చిత్రానికి సంభందించిన అఫీసియల్ పోస్టర్ రిలీజ్ చేసాడు. అందరూ అనుకున్నట్లుగానే 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎంబీ ప్రొడక్షన్స్ 14 రీల్స్ ఎంటెర్టైన్మెట్స్ కలిసి నిర్మించబోతున్నారు. దీని గురించి చిత్ర నిర్మాతల్లో ఒకరైన మైత్రీ మూవీస్ ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. ''మేము మన సూపర్ స్టార్ #SSMB 27 తో కలవబోతున్నాం. మీరు ఇప్పటి దాకా దీని గురించి చాలా విన్నారు.. కౌంట్‌ డౌన్ ప్రారంభమైంది'' అని ట్వీట్ చేసారు. ఇప్పటి దాకా చెప్తున్నట్లే ఈ సినిమా మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా మే 31న ఉదయం 9 గంటల 9 నిమిషాలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం కాబోతోందని అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

అంతేకాకుండా ఈ సినిమాకి ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న 'సర్కార్ వారి పాట' టైటిల్ నిజమనే విధంగా ఈ పోస్టర్ డిజైన్ ఉంది. ఒక టేబుల్ మీద పెన్ను మరియు ప్రభుత్వ సీల్ వేసి ఉన్న ఒక పేపర్.. అధికారిక ముద్ర ఉన్నాయి. దీనిని బట్టి ఈ సినిమా టైటిల్ 'సర్కార్ వారి పాట' అని నిర్ధారించుకోవచ్చు. కాగా వరుస విజయాలతో దూకుడుమీదున్న మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో బ్లాక్ బస్టర్ గా బాప్ అనిపించుకున్నాడు. దీంతో నెక్స్ట్ సినిమాపై అటు అభిమానుల్లో ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. #SSMB 27 గురించి పూర్తి సమాచారం లేనప్పటికీ ఈ చిత్రం ఏ జోనర్ లో ఉండబోతోందో.. మహేష్ లుక్ ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి మహేష్ అభిమానులలో నెలకొనివుంది. ఈ సినిమాకి సంభందించి మిగతా వివరాలు రేపు వెల్లడికానున్నాయి.

ఈ సినిమా అనౌన్స్మెంట్ మూడు నిర్మాణ సంస్థలు వెరైటీగా ప్లాన్ చేసాయి. ఈ ప్రకటన ఇవ్వడానికి రెండు గంటల ముందు నుండి ట్విట్టర్ లో మైత్రీ మూవీ మేకర్స్ ''అఫీసియల్'' అని ట్వీట్ చేయగా జీఎంబీ ఎంటెర్టైమెంట్స్ ''అనౌన్స్మెంట్'' అని.. 14 రీల్స్ ప్లస్ వారు ''సూన్'' అని ట్వీట్ చేసారు.
Tags:    

Similar News