పబ్లిసిటీని పిండుకుంటున్న మహేష్ టీమ్

Update: 2020-04-18 13:05 GMT
పబ్లిసిటీని పిండుకుంటున్న మహేష్ టీమ్
  • whatsapp icon
ఈ జనరేషన్లో కంటెంట్ కంటే ప్రచారానికి ఎక్కువ డిమాండ్. అందుకే ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రచారానికి వాడుతున్నారు. పబ్లిసిటీ అనేది సెలబ్రిటీల జీవితాల్లో ఒక భాగంగా మారిపోయింది. స్టార్ హీరోల పిఆర్ టీంలు 24 గంటలూ ఈమధ్య అదే పని మీద ఉంటున్నాయి. మన టాలీవుడ్ స్టార్ హీరోలను తీసుకుంటే ముఖ్యంగా అల్లు అర్జున్.. మహేష్ బాబుల పి.ఆర్ టీమ్స్ ఈ విషయంలో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాయి.

వారికి మిల్లీ గ్రామ్ విషయం దొరికితే చాలు టన్నుల్లో పబ్లిసిటీ చేస్తారు. ఇప్పటికే బన్నీ ఏం చేసినా కానీ పబ్లిసిటీ కోణంలోనే ఉంటుందని టాక్ ఉంది. ఒక చిన్న సోషల్ మీడియా పోస్ట్ పెట్టినా దానికి పీఆర్ వాళ్ళు విపరీతమైన ప్రచారం కల్పిస్తారని అందరికీ తెలుసు. ఇప్పుడు మహేష్ బాబు కూడా నేను ఏమీ తీసిపోను అంటున్నట్టుగా ఈ విషయంలో బన్నీకి పోటీ ఇస్తున్నాడు. కొత్త సినిమాలకు పబ్లిసిటీ చేస్తే సరేగాని ఎప్పుడో రిలీజ్ అయినా పాత సినిమాలకు ఇప్పుడు పబ్లిసిటి చేయడం చాలామందికి వింతగా ఉంది.

'శ్రీమంతుడు' సినిమా రిలీజ్ ఇప్పటికీ దాదాపు ఆరేళ్లయింది. ఈ సినిమాకు యూట్యూబ్ లో 100 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. అంతే.. ఇది పబ్లిసిటీకి ఓ ముడి సరుకుగా మారింది. యూట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ అనే పోస్టర్లు పెట్టి సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. మహేష్ స్టామినా ఈ రేంజ్ లో ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఏఈ పబ్లిసిటీ హడావుడికి యాంటీ ఫ్యాన్స్ ఊరుకోరు కదా? వాళ్లు కూడా తమ స్టైల్ సెట్ అయితే సోషల్ మీడియాలో ఎదురుదాడికి దిగుతున్నారు. "యూట్యూబ్ లో మిలియన్లు సంపాదించడం కాదు బాక్సాఫీస్ దగ్గర మిలియన్లు సంపాదించి సత్తా చూపించు మహేష్.. ఫేక్ కలెక్షన్లు ఇవ్వడం కాదు" అంటూ గట్టిగా తగులుకుంటున్నారు.
Tags:    

Similar News