బ్రహ్మోత్సవం తర్వాత మహేష్ ట్వీటాడోచ్

Update: 2016-06-20 05:11 GMT
మే నెల 20య్యో తారీఖు.. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం మూవీ రిలీజ్ అయిన డేట్. ఆ నెల ప్రారంభం నుంచి అన్ని రకాల ప్లాట్ ఫామ్స్ లో మహేష్ అండ్ బ్రహ్మోత్సవం టీమ్ చేసిన సందడి మామూలుగా లేదు. కానీ రిలీజ్ రోజున వచ్చిన భయంకరమైన టాక్ దెబ్బకు.. అందరూ గప్ చుప్ అయిపోయారు. మహేష్ సంగతి కూడా అంతే. అప్పటి నుంచి ఆన్ లైన్ లో మళ్లీ కనిపించని సూపర్ స్టార్.. నెల్లాళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అయ్యాడు.

రీసెంట్ గా మహేష్ కి ఫిలింఫేర్ అవార్డ్ దక్కింది. శ్రీమంతుడు చిత్రానికి గాను.. బెస్ట్ యాక్టర్ అవార్డ్ ను అనౌన్స్ చేసింది ఫిలింఫేర్. అయితే.. దీన్ని అందుకునేందుకు మహేష్ రాలేదు కానీ.. తనకు అవార్డ్ ప్రకటించిన వారికి థ్యాంక్స్ చెబుతూ ఓ ట్వీట్ పెట్టాడు. కచ్చితంగా నెల రోజుల తర్వాత మళ్లీ మహేష్ బాబు ఆన్ లైన్ లో కనిపించేసరికి.. ఫ్యాన్స్ కి మళ్లీ జోష్ వచ్చిందని చెప్పాలి.

'దీన్ని సాధ్యం చేసిన నా ఫ్యాన్స్ అందరికీ పెద్ద థాంక్యూ. ఈవెంట్ ను మిస్ అయ్యాను. శ్రీమంతుడుకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ రావడం చాలా గొప్పగా అనిపించింది. ఫిలింఫేర్ మరియు టైమ్స్ గ్రూప్ నకు థాంక్యూ' అంటూ ట్వీట్ చేశాడు మహేష్ బాబు. త్వరలో మురుగదాస్ తో సినిమాకి సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు మహేష్ సిద్ధమవుతున్నాడు.
Tags:    

Similar News