మహేష్ బాబుకు కోర్టు కష్టాలు తప్పేలా లేవు. శ్రీమంతుడు సినిమా కథ కాపీ రైట్స్ ఉల్లంఘన కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపును ఇవ్వాలని మహేశ్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. శ్రీమంతుడు సినిమా స్క్రిప్టు వివాదంలో మహేష్ బాబుకు సంబంధం లేదని మహేష్ తరపు లాయర్లు కోర్టుకు తెలిపారు.
ఆయనకు హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న వారి అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.తదుపరి విచారణకు సినిమా దర్శకుడు కొరటాల శివ, నిర్మాతలతో సహా మహేష్ బాబు కూడా కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేసింది.
ఈ సినిమాను తన నవల 'సచ్చేంత ప్రేమ' నుంచి కాపీ కొట్టి తీశారని శరత్ చంద్ర అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా, నిర్మాత నవీన్ కు మరోసారి సమన్లు జారీ చేస్తూ, చిత్ర హీరోగా ఉన్న మహేశ్ బాబు, దర్శకుడు కొరటాల శివ కూడా కోర్టు విచారణకు రావాల్సిందేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. నిజ జీవితంలో కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని మహేష్ బాబు కలలో కూడా ఊహించి ఉండడు. ప్రస్తుతం శ్రీమంతుడు సినిమాని హిందీలో నిర్మిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/