సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని.. ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోందని సమాచారం. దిల్ రాజు.. అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించనున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవీ శ్రీ ప్రసాద్ ను ఎంచుకున్నారట. ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ కథ హీరోయిన్ సెలెక్షన్ వరకూ వచ్చిందట.
అనిల్ రావిపూడి హీరోయిన్ల కోసం ముంబై భామల వైపు చూడకుండా హైబ్రిడ్ పిల్ల సాయి పల్లవి పేరుని పరిశీలిస్తున్నారట. రీసెంట్ గా అనిల్ రావిపూడి ఈ సినిమా కథను.. హీరోయిన్ క్యారెక్టర్ వివరించేందుకు సాయిపల్లవి కోసం చెన్నై వెళ్ళాడట. మిగతా హీరోయిన్లలా సాయి పల్లవి ఏ ఆఫర్ వచ్చినా లటుక్కున తన హ్యాండ్ బ్యాగ్ లో వేసుకునే రకం కాదు. కథ నచ్చి.. క్యారెక్టర్ నచ్చితేనే సైన్ చేస్తుంది. కానీ దిల్ రాజు బ్యానర్.. మహేష్ బాబు సినిమా కాబట్టి దాదాపుగా 'నో' చెప్పే అవకాశం ఉండకపోవచ్చు.
సాయిపల్లవి కనుక హీరోయిన్ గా ఫైనలైజ్ అయితే మహేష్ - సాయి పల్లవి జోడీ డిఫరెంట్ గా ఉంటుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. వరస హిట్లతో జోరు మీద ఉన్న అనిల్ రావిపూడి డైరెక్టర్ అనగానే ఈ ప్రాజెక్ట్ క్రేజీగా మారింది. ఇక సాయి పల్లవి లాంటి హీరోయిన్ తోడైతే మరింత క్రేజీగా మారుతుంది.