సూపర్ స్టార్ మహేష్ నటించిన `మహర్షి` రిలీజై మిశ్రమ స్పందనలు అందుకుంది. లాజిక్కులు పట్టించుకోకపోతే వంశీ పైడిపల్లి ఓ చక్కని సందేశాత్మక సినిమాని అందించారని క్రిటిక్స్ సహా కామన్ ప్రేక్షకుల నుంచి మెప్పు కనిపిస్తోంది. ఇప్పటికే ఓవర్సీస్ లో హాఫ్ మిలియన్ మార్క్ వసూళ్లను దక్కించుకుని మిలియన్ డాలర్ క్లబ్ వైపు వెళుతోందని తెలుస్తోంది. అలాగే తొలి వీకెండ్ ఆన్ లైన్ టిక్కెట్ విండోలు జామ్ అయ్యాయి కాబట్టి ఆ మేరకు తెలుగు రాష్ట్రాల్లో నాన్ బాహుబలి కేటగిరీలో సరికొత్త వీకెండ్ రికార్డులు నమోదు అవుతాయని ట్రేడ్ విశ్లేషిస్తోంది.
ఈ ప్రచారంతో మహేష్ - వంశీ పైడిపల్లి సహా `దిల్ రాజు - పీవీపీ- దత్` బృందంలో ఆనంద హేళ కనిపిస్తోందని ముచ్చటించుకుంటున్నారు. అంతేకాదు ఇదే హుషారులో మహేష్ తదుపరి సినిమాపై దృష్టి సారిస్తున్నారని తెలుస్తోంది. ఈ వారం అంతా మహర్షి ప్రమోషన్స్ .. పార్టీలు ఇతరత్రా సంగతులతోనే సరిపోతుంది కాబట్టి అటుపై #MAHES26 పై మహేష్ దృష్టి మళ్లిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికే అనీల్ రావిపూడి - అనీల్ సుంకర బృందం ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా పూర్తి చేస్తోంది. కథానాయికల్ని.. ఇతర కీలక పాత్రధారుల్ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. జూన్ 15న సినిమాని ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ ని అదే రోజు నుంచి కంటిన్యూ చేస్తారని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందింది.
ఇప్పటికే లేడీ అమితాబ్ విజయశాంతి మహేష్ కు అత్త పాత్రలో నటిస్తున్నారని... అలాగే ఇందులో నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ ఓ హిలేరియస్ కామెడీ రోల్ లో నటించనున్నారని ప్రచారం సాగుతోంది. రష్మిక మందనను ఓ నాయికగా ఫైనల్ చేశారని వార్తలొచ్చాయి. `ఎఫ్ 2` లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని తెరకెక్కించిన అనీల్ రావిపూడి ఇదివరకూ మహేష్ నటించిన `దూకుడు` చిత్రానికి స్క్రిప్టు విభాగంలో పని చేశారు. అందుకే ఇప్పుడు ఎలాంటి సందేశాలు ఇవ్వకుండా క్లీన్ ఎంటర్ టైనర్ స్టోరీని మహేష్ కోసం రూపొందించారట. అందుకే సుకుమార్ మెసేజ్ ఓరియెంటెడ్ స్క్రిప్టును సైతం పక్కన పెట్టి మరీ అనీల్ రావిపూడి స్క్రిప్టుని #MAHES26 కోసం ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. మరిన్ని వివరాల్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించేందుకు ప్లాన్ చేస్తోందట.