సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం మహర్షి చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మే 9న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. మరోవైపు అనీల్ రవిపూడి దర్శకత్వంలో మహేష్ 26 సినిమాని పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. ఈలోగానే ఏఎంబి సినిమాస్ సూపర్‌ఫ్లెక్స్ బిజినెస్ ని పరుగులు పెట్టించడమే ధ్యేయంగా అందుకోసం కొంత సమయం కేటాయిస్తున్నారట.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ప్రఖ్యాత మ్యాడమ్ తుస్సాడ్స్ రూపొందించిన మహేష్ మైనపు విగ్రహాన్ని ఏఎంబీ సినిమాస్ లో లాంచ్ చేయడం ద్వారా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మాల్ కి గుర్తింపు దక్కుతుందని ప్లాన్ చేశారట. ఈ ఈవెంట్ కి అంతర్జాతీయ మీడియా సైతం కవరేజీకి విచ్చేస్తుండడంతో భారీగా ఫ్యాన్స్ ని ఆహ్వానించారట. రేపటి (25 మార్చి) ఈవెంట్ కి తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మొత్తంలో మహేష్ అభిమానులు పెద్ద సక్సెస్ చేసేందుకు వస్తున్నారని తెలుస్తోంది. స్టార్ల జిగ్ జాగ్ నడుమ ఇలాంటి ఈవెంట్లు జరుగుతాయి కానీ, మేం మాత్రం అభిమానులకే ప్రాధాన్యతనిచ్చామని నమ్రత టీమ్ ప్రచారం చేస్తోంది. అయితే ఈ వేదిక వద్దకు ఎందురు వచ్చినా ఓ ఐదుగురికి మాత్రమే ఛాన్స్ దక్కుతుందని తెలిసి ఇతర అభిమానులు ఎంతో నిరాశకు గురవుతున్నారు. ప్రపంచం నలుమూలలా ఈ కాంటెస్ట్ ని రన్ చేసి అందులోంచి కేవలం ఐదుగురికే ఛాన్స్ ఇస్తే ఎలా? అంటూ ఫ్యాన్స్ గరంగానే ఉన్నారట.
అయితే ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఘట్టమనేని అభిమానికి మహేష్ ని కలిసే సద్భాగ్యం కలుగుతుందా? అంటే అస్సలు ఛాన్సే లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఏఎంబీ మాల్ లో మైనపు విగ్రహావిష్కరణ నేపథ్యంలో అభిమానులకు ఓ కాంటెస్ట్ ని రన్ చేశారు. అందులో నెగ్గిన వారి నుంచి ఫిల్టర్ చేసి ఫైనల్ గా ఓ ఐదుగురికి మాత్రం మహేష్ తో పాటు వేదికను షేర్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారట. వీరికి బహుమతులు అందజేస్తారు. ఇకపోతే ఈ ఈవెంట్ కి మీడియాను మాత్రం ఆహ్వానించారు. హైదరాబాద్ ఏఎంబీలో మహేష్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి అనంతరం సింగపూర్ మ్యాడమ్ తుస్సాడ్స్ కి తరలిస్తారట.