సూపర్ స్టార్ మహేష్ బాబు కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్నారట. ఆ విషయాన్ని స్వయంగా మహేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. స్టార్స్ ఇప్పటికే పలువురు వ్యాక్సిన్ ను తీసుకున్న విషయం తెల్సిందే. వ్యాక్సిన్ తీసుకున్న వారు ఫొటోలను షేర్ చేస్తున్నారు. కాని మహేష్ బాబు మాత్రం ఫొటోను షేర్ చేయకుండా తాను వ్యాక్సిన్ తీసుకున్నాను అంటూ ఒక టెక్స్ ట్వీట్ ను షేర్ చేశాడు. టాలీవుడ్ ప్రముఖులు ఇప్పటికే పలువురు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవడం జరిగింది. ఆ జాబితాలో మహేష్ బాబు కూడా చేరాడు.
మహేష్ బాబు ట్విట్టర్ లో.. నా వ్యాక్సిన్ పూర్తి అయ్యింది. మీరు కూడా తప్పకుండా తీసుకోండి. కరోనా సెకండ్ వేవ్ అత్యంత ప్రమాదకరంగా ఉంది. ప్రతి ఒక్కరిని కూడా కరోనా సెకండ్ వేవ్ ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. కనుక మే 1 నుండి 18 ఏళ్లు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ ను తీసుకోవాల్సిందిగా మహేష్ బాబు సూచించాడు. కరోనా వ్యాక్సిన్ ను తీసుకుని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలంటూ మహేష్ బాబు పేర్కొన్నాడు.
మహేష్ బాబు వ్యాక్సిన్ రెండు డోసులను పూర్తి చేసుకున్నాడా లేదా మొదటి డోస్ పూర్తి అయ్యిందా అనే విషయాన్ని చెప్పలేదు. నా వ్యాక్సిన్ పూర్తి అయ్యిందని ట్వీట్ చేశాడు కనుక రెండు డోసులు కూడా పూర్తి అయ్యి ఉంటుందని అంటున్నారు. మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ కరోనా వల్ల ఆగిపోయిన విషయం తెల్సిందే. చిత్ర యూనిట్ సభ్యుల్లో కొందరు కరోనా బారిన పడటం వల్ల షూటింగ్ ను నిలిపి వేశారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మళ్లీ షూటింగ్ ను మొదలు పెట్టే అవకాశం ఉందంటున్నారు.