సీనియర్ హీరో, యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నుంచి దాదాపు నాలుగేళ్ల విరామం తరువాత వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ `విక్రమ్`. యంగ్ టాలెంటెడ్ లోకేష్ కనగరాజ్ ఈ చిత్రాన్ని అత్యకంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. కమల్ నటిస్తూ స్వీయి నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఈ మూవీని నిర్మించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నరేష్ కీలక పాత్రల్లో నటించారు. హీరో సూర్య కీలక అతిథి పాత్రలో రోలెక్స్ గా నటించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.
తొలి షో నుంచే యూనానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుని వరల్డ్ వైడ్ గా రికార్డులు సృష్టించింది. కమల్ నట విశ్వరూపం, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్, నరేన్ ల సెలటిల్డ్ పెర్ఫార్మెన్స్, అనిరుథ్ సంగీతం, లోకేష్ మెస్మరైజింగ్ టేకింగ్ వెరసి ఈ మూవీని బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలబెట్టాయి. చాలా ఏళ్ల తరువాత ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడంతో కమల్ ఈ సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకున్నారు.
దర్శకుడికి కాస్ట్లీ కార్, చిత్ర బృందానికి బైక్ లు.. హీరో సూర్యకు రోలెక్స్ వాచ్ .. ఇలా బహుమతులు అందించిన ఈ మూవీ సక్సెస్ ఆనందాన్ని తన టీమ్ మెంబర్స్ తో పంచుకున్నారు. తెలుగులో విడుదల చేసిన హీరో నితిన్ కి ఈ మూవీ భారీ లాభాల్ని తెచ్చి పెట్టింది. మూడు వారాల్లోనే ఈ మూవీ వంద కోట్లకు మించి వసూళ్లని రాబట్టి కమల్ సినిమాల్లోనే సరికొత్త రికార్డుని సృష్టించింది. ఈ మూవీ సాధించిన విజయంపై పలువురు హీరోలు ప్రశంసలు కురిపించారు.
తాజాగా సూపర్ స్టార్ మహేష్ `విక్రమ్` మూవీపై స్పందించి షాకింగ్ కామెంట్స్ చేయడమే కాకుండా మినీ రివ్యూ ఇచ్చారు. తనకు నచ్చిన సినిమా విషయంలో వెంటనే స్పందించే మహేష్ విదేశాల్లో వుండటం వల్ల `విక్రమ్` మూవీపై కాస్త ఆలస్యంగా స్పందించారు. `విక్రమ్` బ్లాక్ బస్టర్ సినిమా. ఒక కొత్త యుగం కల్ట్ క్లాసిక్. లోకేష్ మిమ్మల్ని కలుసుకొని `విక్రమ్` గురించి చర్చించడానికి ఇష్టనడుతున్నాను. మైండ్ బెండింగ్ సెన్సేషనల్ స్టఫ్ ఇది బ్రదర్.
ఇక విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అబ్బురపరిచే వస్థాయిలో నటించారు. వీరి నుంచి ఆశించని స్థాయి నటనని రాబట్టారు. ఇంతకు మించి ఆశించలేం. ఆ స్థాయిలో వీరి పాత్రల్లో ఒదిగిపోయారు. వావ్ అనిపించారు. అనిరుథ్ ఉత్తమమైన సంగీతాన్ని అందించావు. ఇది చాలా కాలం పాటు నా ప్లే జాబితాలో వుండబోతోంది.
ఫైనల్ గా లెజెండ్ కమల్ హాసన్ గారి నటన గురించి మాట్లాడేంత అర్హత నాకు లేదు. నేను చెప్పగలిగింది ఒక్కటే.. నేను మీకు వీరాభిమానిని. ఇది నాకు అత్యం గర్వించే క్షణాలలో ఒకట. సర్ మీకు, మీ అద్భుతమైన బృందానికి అభినందనలు` అని సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ మేష్ `విక్రమ్` మూవీపై ప్రశంసల వర్షం కురిపించారు.