మహేష్ మూవీకి.. కామన్ గా ఫైనల్

Update: 2016-09-15 12:23 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫస్ట్ టైమ్ ఓ కొత్త అటెంప్ట్ చేస్తున్నాడు. మురుగదాస్ తో చేయనున్న మూవీని.. తెలుగు-తమిళ భాషల్లో కలిపి తెరెకెక్కిస్తున్నాడు. గతంలో కూడా మహేష్ నటించిన సినిమాలు తెలుగు-తమిళంలో ఒకేసారి విడుదలైనా అవన్నీ కేవలం తెలుగు నుంచి తమిళ్ కి డబ్బింగ్ మాత్రమే. కానీ ఓ బైలింగ్యువల్ మూవీ చేయడం మాత్రం ఇదే మొదటిసారి.

అందుకే ప్రతీ విషయంలోనూ చాలా అలర్ట్ గా ఉంటున్నాడు సూపర్ స్టార్. ముఖ్యంగా టైటిల్ విషయంలో ఏ మాత్రం ఛాన్స్ తీసుకోవడం లేదు. ఓ సినిమాను ప్రమోట్ చేయడానికి టైటిల్ చాలా ముఖ్యం. ఇప్పుడు తమిళ్ కోసం వేరే టైటిల్ ని కనుక సెట్ చేస్తే.. రెండు బ్రాండ్లను ప్రమోట్ చేసినంత పనవుతుంది. అందుకే.. ఆడియన్స్ లోకి త్వరగా వెళ్లేందుకు గాను.. రెండు భాషల్లోనూ ఒకటే టైటిల్ ఉండేలా ఫైనల్ చేయమని దర్శకుడు మురగదాస్ కి చెప్పాడట మహేష్. తమిళ్ సినిమాలకు చాలావరకూ తమిళ్ భాషలోనే టైటిల్స్ ఉంటాయనే విషయంలో తెలిసిందే.

అందుకే తెలుగు-తమిళ్ కు సరిపోయేలా కొన్ని టైటిల్స్ సూచించాడట మురగదాస్. వీటిలోంచి ఒకటి ఫైనల్ చేసి.. రిలీజ్ కి మూడు-నాలుగు నెలల ముందే అనౌన్స్ చేసేస్తారని తెలుస్తోంది.
Tags:    

Similar News