సూపర్ స్టార్ మహేష్ నటించిన 28వ సినిమా సర్కార్ వారి పాట థియేటర్ల నుంచి తొలి వీకెండ్ భారీ వసూళ్లను సాధించిందని ట్రేడ్ అనాలిసిస్ చేస్తోంది. నిజానికి ఈ సినిమా ద్వితీయార్థం ఆశించిన రేంజులో కనెక్టవ్వలేదని డివైడ్ టాక్ వచ్చినా కానీ ఆరంభ వసూళ్లకు ఎలాంటి డోఖా లేదు. మహేష్ సహా చిత్రబృందం చేసిన ప్రచారం ఆరంభ వసూళ్లకు పెద్ద ప్లస్ అయ్యిందని చెప్పాలి.
ఇకపోతే మహేష్ తదుపరి సినిమాలపై దృష్టి సారించారని సమాచారం. ఓవైపు దర్శకధీరుడు రాజమౌళితో సినిమా గురించి చర్చిస్తూనే .. త్రివిక్రమ్ తో మూవీని పట్టాలెక్కించేందుకు మహేష్ సన్నాహకాల్లో ఉన్నారని తెలిసింది.
మహేష్ నటించే 28వ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. SSMB28 రెగ్యులర్ చిత్రీకరణ జూలై నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఇప్పటికే త్రివిక్రమ్ బౌండ్ స్క్రిప్ట్ ని లాక్ చేసారు. ఇక ప్రీప్రొడక్షన్ పనులు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. జూలైలో చిత్రీకరణను ప్రారంభించి డిసెంబర్ నాటికి టాకీ మొత్తం పూర్తి చేయాలన్నది ప్లాన్. 2023 సంక్రాంతి విడుదల లక్ష్యంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
సర్కార్ వారి పాట ఒక టిఫికల్ లైన్ తీసుకుని లైటర్ వెయిన్ లో తెరకెక్కించారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇక తదుపరి త్రివిక్రమ్ కూడా ఇంచుమించి మహేష్ లోని మాస్ ని క్లాస్ ని ఎలివేట్ చేస్తూ `అల వైకుంఠపురములో` తరహాలో క్లాసికల్ సినిమా తీస్తారా? అన్నది వేచి చూడాలి.
తదుపరి రాజమౌళితో సినిమా అత్యంత భారీ కాన్వాస్ తో ఉంటుంది. ఇది పాన్ ఇండియా కేటగిరీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్ లోనే తొలి పాన్ ఇండియా సినిమా అవుతుంది. త్రివిక్రమ్ మూవీ రెగ్యులర్ చిత్రీకరణ కు సంబంధించిన వివరాల్ని టీమ్ అధికారికంగా వెల్లడించాల్సి ఉంటుంది.