మణిరత్నం దర్శకత్వంలో మహేష్ అంటూ కొన్నేళ్ల కిందట ఒక వార్త హల్ చల్ చేసిన వార్త గుర్తుండే ఉంటుంది. అది మల్టీస్టారర్ అని.. అందులో తమిళ హీరో విజయ్ కూడా నటిస్తాడని కూడా ప్రచారం సాగింది. కానీ ఉన్నట్లుండి ఈ సినిమా వార్తల్లో లేకుండా పోయింది. దీంతో ఇదంతా ఉత్త ప్రచారమే అనుకున్నారంతా. కానీ విజయ్.. తన కాంబినేషన్లో మణిరత్నం సినిమా తీయాలనుకున్న మాట వాస్తవమే అని మహేష్ వెల్లడించాడు. ఓ తమిళ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ఈ విషయాన్ని వెల్లడించాడు.
‘‘విజయ్ నాకు మంచి స్నేహితుడు. మణిరత్నం సార్ డైరెక్షన్లో మేమిద్దరం ‘పొన్నియన్ సెల్వన్’ అనే సినిమా చేయాల్సింది. కానీ అది మిస్సయింది. రెండు వారాల్లో లుక్ టెస్ట్ ఉంటుందని.. చెన్నైకి రావాల్సి ఉంటుందని మణి సార్ చెప్పారు. నేను చాలా ఆతృతతో ఎదురుచూశాను. కానీ నేను అనుకున్నట్లు జరగలేదు. ఆ సినిమా ప్రారంభం కాలేదు. నేను, విజయ్ కలిసి నటించడానికి కథ చాలా ముఖ్యం. అంతకంటే ముఖ్యంగా మా ఇద్దర్నీ హ్యాండిల్ చేయగలిగే దర్శకుడు కావాలి. అందుకే మేమిద్దరం ఆ తర్వాత కూడా కలిసి నటించలేదు’’ అని మహేష్ తెలిపాడు.
విజయ్ హీరోగా నటించిన ‘కత్తి’ రీమేక్ కూడా తన దగ్గరికే ముందు వచ్చిందని.. తనకు రీమేక్ సినిమాల పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ మురుగదాస్ దర్శకత్వం వహిస్తే చేయడానికి సిద్ధమని చెప్పానని.. ఐతే అప్పుడాయన హిందీ సినిమా విషయంలో బిజీగా ఉండటంతో తానా సినిమా చేయలేకపోయానని మహేష్ తెలిపాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/