సూపర్ స్టార్ మహేష్ బాబుకు తన సినిమాల్ని అభిమానుల మధ్య చూడటం భలే సరదా. ఒకప్పుడు తన ప్రతి సినిమానూ థియేటర్ కు వచ్చి చూసేవాడు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్లో సందడి చేసేవాడు. కానీ ఈ మధ్య ఆ అలవాటు పక్కనబెట్టేశాడు. ప్రివ్యూ థియేటర్లలో మాత్రమే సినిమాలు చూస్తున్నాడు. శ్రీమంతుడు సినిమా బెనిఫిట్ షోలకు కానీ.. రెగ్యులర్ షోలకు కానీ మహేష్ రాలేదు.
ఎందుకిలా అని మహేష్ ను అడిగితే.. ‘‘అభిమానులతో కలిసి సినిమా చూడ్డానికి మించిన ఆనందం ఉండదు. ఇది వరకు నా సినిమా విడుదలైన రోజు ఉదయాన్నే సుదర్శన్ థియేటర్ కు వెళ్లి ఫ్యాన్స్ తో కలిసి సినిమా చూసేవాణ్ని. కానీ అక్కడికి వెళ్తున్నపుడు నన్ను చూడాలన్న ఆత్రుతలో అభిమానులు సినిమాను ఆస్వాదించడం లేదు. మరీ ఎక్కువ గోల చేస్తున్నారు. ఎవరికీ సినిమా చూసిన సంతృప్తి కలగట్లేదని అర్థమైంది. అందుకే వెళ్లడం మానేశా. అభిమానులు సినిమాని ఎంజాయ్ చేస్తే చాలు. వాళ్ల ఆనందమే నా ఆనందం’’ అనిచెప్పాడు మహేష్.
తన అభిమానులంటే తనకు గౌరవం ఉందని.. అందుకే తన గత రెండు సినిమాలు ఫెయిలైనందుకు వాళ్లకు క్షమాపణలు చెప్పానని.. ఉద్వేగంలో నిజాయితీగా ఆ మాటలు చెప్పానని మహేష్ అన్నాడు. తన సినిమాల ట్రైలర్లు చూసి ఎంతో అంచనాతో అభిమానులు సినిమాకు వస్తారని.. సినిమా బాలేకుంటే చాలా బాధపడతారని.. వారి ఆవేదన ఎలా ఉంటుందో తనకు తెలుసు కాబట్టే క్షమాపణ చెప్పానని.. తన ప్రతి సినిమా అభిమానులకు నచ్చేలా ఉండేలా చూసుకోవడం తన బాధ్యత అని మహేష్ చెప్పాడు.