టాలీవుడ్ హీరోల్లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేష్ బాబు ముందు వరుసలో ఉంటాడనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సూపర్ స్టార్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికి - అతి తక్కువ కాలంలోనే సొంత ఇమేజ్ ను బిల్డ్ చేసుకుని - సూపర్ స్టార్ అనిపించుకునేలా సక్సెస్ లను దక్కించుకున్న హీరో మహేష్ బాబు. అందుకే మహేష్ బాబు అంటే ఎంతో మందికి అభిమానం. ఇక ఆయన సింప్లిసిటీ మరియు ఆయన పెద్దల పట్ల ప్రవర్తించే తీరుతో సినీ పరిశ్రమలో కూడా ఎంతో మంది ఆయనకు అభిమానులు అయ్యారని చెప్పుకోవాలి.
తాజాగా రాజమండ్రికి చెందిన 106 ఏళ్ల సత్యవతి అనే బామ్మను తన వద్దకు రప్పించుకుని - ఆమె కోరుకున్న ఫొటోను తీసుకుని పంపించాడు. పెద్దల పట్ల ఆయనకు ఉన్న గౌరవంను ఈ సంఘటన మరోసారి నిరూపించింది. మహేష్ బాబు తాజాగా బామ్మతో తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోకు మహేష్ ను అభినందిస్తూ పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. హీరో సుమంత్ కూడా మహేష్ బాబును అభినందిస్తూ ట్వీట్ చేశాడు.
సుమంత్ ట్విట్టర్ లో.. పెద్దలకు మీరు ఎంతో గౌరవంను ఇచ్చే హీరో - ఆ కారణం వల్లే ఈతరం హీరోల్లో మా తాతయ్య ఏయన్నార్ గారికి మీరు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది అంటూ ట్వీట్ చేశాడు. సుమంత్ ట్వీట్ కు మహేష్ బాబు స్పందించాడు. థ్యాంక్స్ సుమంత్ - ఏయన్నార్ గారు నాకు ఎప్పటికి ఆదర్శప్రాయులు అంటూ రీ ట్వీట్ చేశాడు. వీరిద్దరి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.