సూపర్ స్టార్ మహేష్ మళ్లీ ఫారెన్ చెక్కేసారా? కుటుంబం కోసం ఉన్న హాలీడేస్ ని మొత్తం వాడేస్తున్నారా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే మహేష్ కుటుంబ సమేతంగా లండన్ టూర్ వెళ్లిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వస్తోంది. కొన్ని రోజుల పాటు కుటుంబంతో అక్కడే గడపనున్నారని... ఈలోపు త్రివిక్రమ్ సినిమాకి సంబంధించిన అన్ని పనులు పూర్తిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే త్రివిక్రమ్ తో ఓ ప్రాజెక్ట్ లాక్ అయిన సంగతి తెలిసిందే. అయితే కథ విషయంలో మార్పులు చేర్పులు కోరవడంతో డిలే అవుతోంది. ఆ మధ్య యూరప్ ట్రిప్ అనంతరం మహేష్ ఇండియాకి రాగానే త్రివిక్రమ్ తో చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే అవసరమైన మార్పులు సూచించడంతో మహేష్ సిటీలో ఉండగానే ఆ పనుల్ని త్రివిక్రమ్ వేగంగా పూర్తి చేసారు.
ఇటీవలే మరోసారి మహేష్ కి ఫైనల్ వెర్షన్ వినిపించారుట. కథ మహేష్ అనుకున్న విధంగా మలిచడంతో ప్రాజెక్ట్ లాక్ అయింది. ఆగస్టులో సినిమా ప్రారంభం అవుతుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొంత గ్యాప్ దొరకడంతో మళ్లీ లండన్ ప్లైట్ ఎక్కేసారు. యూరప్ టూర్ ముగిసి కనీసం రెండు నెలలు కూడా పూర్తవ్వలేదు. అప్పుడే లండన్ టూర్ ఏంటి? అంటే అంటే కుటుంబం సహా పిల్లలల కోసమే వెళ్లినట్లు తెలుస్తోంది.
త్రివిక్రమ్ ప్రాజెక్ట్ మొదలైతే కంట్యూన్యూస్ గా షూటింగ్ ఉంటుంది. ఈ ఏడాది మొత్తం షూట్ లోనే బిజీగా ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది లోపు ఈ సినిమా పూర్తిచేసి రిలీజ్ చేయాలి. లేదంటే రాజమౌళి ఒప్పుకోరు. ఈ నేపథ్యంలో మళ్లీ వెకేషన్ కి వెళ్లే అవకాశం ఉండదు. ఈ సినిమా పూర్తికాగానే రాజమౌళి సినిమా షూట్ లో పాల్గొనాల్సి ఉంటుంది.
ఇదంత ఈజీ ప్రాసస్ కాదు. రాజమౌళి సినిమా ప్రారంభం అవుతుందంటే రెండు..మూడు నెలలు ముందునుంచే జక్కన్న టీమ్ తో కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సి ఉంటుంది. మేకోవర్..వర్క్ షాప్ ఇలా చాలా కథే ఉంటుంది. ఆ రెండు పనులు పూర్తిచేసిన తర్వాత షూట్ మొదలవుతుంది. అప్పటి నుంచి క్షణం కూడా ఖాళీ ఉండదు. రేయింబవళ్లు రాజమౌళి తో షూటింగ్ లో బిజీ అవ్వాల్సి ఉంటుంది.
సెట్ లోనే దాదాపు డే అంతా గడిచిపోతుంది. ఫ్యామిలీకి టైమ్ కేటాయించేంత సమయం ఉండదు. షూటింగ్ సమయంలో ఫ్యామిలీ..పిల్లలు అంటే జక్కన్న ఒప్పుకోడు. అగ్రిమెంట్ అన్న తర్వాత దానికి కట్టుబడి పనిచేయాల్సి ఉంటుంది. వృత్తి పరంగా మహేష్ సైతం అంతే నిబద్దతగా ఉంటారు. అలాంటి ఇద్దరి పని దిగ్గజాలు ఒకే చోట ఉంటే మిగతా వాళ్లకి అంతే పని ఉంటుంది.
మధ్యలో వెకేషన్ కి వెళ్తాను? విశ్రాంతి కావాలంటే? కుదరదు. సినిమా ప్రారంభం దగ్గర నుంచి రిలీజ్ అయ్యే వరకూ జక్కన్న తో కలిసి ప్రయాణం చేయాల్సిందే. ఇలా అన్ని విషయాలు ముందుగానే ఆలోచించుకునే మహేష్ మళ్లీ లండన్ ప్లైట్ ఎక్కినట్లు తాజా సన్నివేశాన్ని బట్టి తెలుస్తోంది.