లేటుగా వచ్చినా లేటెస్టు గా రావడం.. బాబా మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ బాగా ఫేమస్. మూవీ మేకింగ్ విషయంలో ఈ డైలాగ్ చెప్పి సమర్ధించుకోవడం బాగానే ఉంటుంది. కానీ అన్ని విషయాల్లో ఈ స్కీమ్ వర్కవుట్ కాదు.
సహజంగా టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలు లేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు స్పైడర్ పరిస్థితి కూడా ఇంతే. పర్ఫెక్షనిజం పేరు చెప్పి సాగతీస్తున్నారు. ఇది ఓకే కానీ.. ఇప్పుడు మహేష్ బాబు ఓ ట్వీట్ పెట్టడంలో కూడా ఆలస్యం చేయడంపై బోలెడన్ని పంచ్ లు పడుతున్నాయి. కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డ్ ప్రకటించిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడు తాపీగా "కె విశ్వనాథ్ గారికి అభినందనలు.. ఆయన నాకు స్ఫూర్తి" అంటూ మహేష్ పెట్టిన ట్వీట్ కామెడీ అయిపోతుంది.
అడపా దడపా తప్పితే ట్వీట్ పెట్టని మహేష్.. ఇంత ఆలస్యంగా రియాక్ట్ కావడంపై జనాలు బాగానే మండిపడుతున్నారు. సినిమా ప్రమోషన్ కోసం జల్లికట్టు విషయంలో యాక్టివ్ గా స్పందిస్తాడు కానీ.. తెలుగు సినిమాకు గౌరవం దక్కితే మాత్రం స్పందించడం ఆలస్యమవుతుందా అని నిలదీస్తున్నారు. అందుకే ఇలాంటి విషయాల్లో ట్విట్టర్ పిట్టను ముందుగానే కూయించాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/