మరో వీడియోతో బుక్‌ అయిన ముసలోడు!

Update: 2020-08-25 17:30 GMT
సుశాంత్‌ మృతి చెందినప్పటి నుండి కూడా రియా చక్రవర్తి మరియు మహేష్‌ భట్‌ లపై సోషల్‌ మీడియాలో విమర్శలు వస్తన్నాయి. ఇటీవల మహేష్‌ భట్‌ తెరకెక్కించిన సడక్‌ 2 చిత్రంపై నెటిజన్స్‌ ఏ స్థాయిలో వ్యతిరేకత చూపించారో మనం అందరం చూశాం. ఇక రియా విషయంలో ఆయన ఇన్వాల్వ్‌ మెంట్‌ ఉన్న కారణంగానే ఆమె సుశాంత్‌ ను ఇబ్బంది పెట్టి ఉంటుందని అందుకే సుశాంత్‌ చనిపోయి ఉంటాడని కొందరు అంటూ ఉంటే మరి కొందరు మాత్రం సుశాంత్‌ ను మహేష్‌ భట్‌ చంపించి ఉంటాడనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

రియాతో ఈయనకు ఉన్న సంబంధాల గురించి రకరకాల పుకార్లు షికారు చేశాయి. ఇద్దరి ఫొటోలు మరియు వీడియోలు నెట్టింట వైరల్‌ అవ్వడంతో సుశాంత్‌ కేసులో మహేష్‌ భట్‌ కూడా నింధితుడు అయ్యాడు. సీబీఐ ఎంక్వౌరీ లో భాగంగా ఆయన్ను కూడా ప్రశ్నించే అవకాశం ఉందని అంటున్నారు. ఇలాంటి సమయంలో దివంగత జియా ఖాన్‌ తో మహేష్‌ భట్‌ వీడియో ఒకటి లీక్‌ అయ్యింది.

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఆ వీడియోలో జియా ఖాన్ మరియు మహేష్‌ భట్‌ చాలా క్లోజ్‌ గా ఉన్నారు. హీరోయిన్‌ లు లేదా ఇండస్ట్రీలో ఎవరు మృతి చెందినా కూడా ఆ వివాదం చుట్టు తిరిగి ఆయన వద్దకు వస్తుంది. ఈ విషయంలో కూడా రియా చక్రవర్తిని ఎలా అయితే ప్రభావితం చేశాడో అలాగే జియా ఖాన్‌ కూడా ప్రభావితం చేసి ఉంటాడని అందుకే ఆమె ఆత్మ హత్య చేసుకుందని అంటున్నారు. మొత్తానికి సుశాంత్‌ మృతి విషయంలో ముసలోడు మరింతగా ఇరుక్కున్నాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.
Full View
Tags:    

Similar News