ఇండస్ట్రీలో మళ్ళీ మొదలైన టైగర్స్ ట్రెండ్..!

Update: 2021-08-09 05:51 GMT
సినీ అభిమానులు తమ ఫేవరేట్ హీరోలను పులులు సింహాలతో పోల్చుతూ ఆరాధిస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హీరోలు సైతం అప్పుడప్పుడు సినిమాల డైలాగ్స్ లో వాటిని ప్రస్తావిస్తూ ఉంటారు. ఇది ఒక్క టాలీవుడ్ కే పరిమితం కాలేదు. అన్ని ఇండస్ట్రీలలో ఉంది. కాకపోతే ఇవే ఫ్యాన్ వార్స్ కి దారి తీస్తుంటాయి. మా హీరో పులి అంటే మా హీరో సింహం అంటూ పోటీకి దిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్ళీ టైగర్స్ ట్రెండ్ వచ్చేసిందని అర్థం అవుతోంది.

'పుష్ప' సినిమాలోని ఫస్ట్ సాంగ్ 'దాక్కో దాక్కో మేక' కు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో 'దాక్కో దాక్కో మేక.. పులొచ్చి కొరుకుద్ది పీక' అనే లైన్స్ మహేష్ బాబు ని ఉద్దేశిస్తూ పెట్టినవే అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలలో తెగ ట్రోల్స్ చేశారు. బన్నీ పులి అని.. మహేష్ మేక అని కామెంట్స్ చేశారు. గతేడాది సంక్రాంతి కి బాక్సాఫీస్ వద్ద మహేష్ - అల్లు అర్జున్ పోటీ పడగా.. ఆ సమయంలో 'అల వైకుంఠపురములో' సినిమాలోని 'పులొచ్చింది.. మేక చచ్చింది' డైలాగ్ ని చూసి ఇలానే ట్రోల్స్ చేశారు.

ఇప్పుడు తాజాగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా టీజర్ విడుదలైంది. ఇందులో 'టైగర్' 'రాబిట్' లను కంపేర్ చేస్తూ మహేష్ చెప్పిన డైలాగ్ కి అభిమానులు ఈలలు వేస్తున్నారు. అదే సమయంలో ఇక్కడ టైగర్ అంటే మహేష్ అని.. కుందేలు అల్లు అర్జున్ అని సూపర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. గతంలో 'ఆగడు' సినిమా టైంలో కూడా ఇలాంటివే జరిగాయి. అందులో మహేష్ చెప్పిన 'డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకొచ్చి తొడ కొట్టిందట' 'ప్రతివాడు పులులు సింహాలతో ఎదవ కంపేరిజన్స్' వంటి డైలాగ్స్ ని ఇతర హీరోలకు అన్వహిస్తూ ట్రోల్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అయితే సినిమాలో డైలాగ్స్ ని బట్టి హీరోల అభిమానులు సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోల్ చేసుకుంటారు కానీ, వాస్తవానికి మన హీరోలు కావాలని అలాంటివి చేయరు. ఫ్యాన్స్ ని సంతృప్తి పరచడానికి అలాంటి దర్శక రచయితలు రాసే సంభాషణలు పలుకుతుంటారు అంతే. ఇవేమీ ఆలోచించని ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో మాటల యుద్ధానికి దిగుతుంటారు.
Tags:    

Similar News