సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న సర్కార్ వారి పాటలో విలన్ పాత్రధారి కోసం ఇంకా సెర్చ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇంతకుముందు అరవింద స్వామి- ఉపేంద్ర పేర్లు వినిపించాయి. ఆ తరవాత బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ కపూర్ ని ఫైనల్ చేసేశారని ముచ్చట వినిపించింది. కానీ చివరికి ఆయనా కాల్షీట్లు ఇవ్వకపోవడంతో ఆర్.మాధవన్ ని లాక్ చేశారని కథనాలొస్తున్నాయి.
ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జన్ పుష్ప కోసం కూడా మ్యాడీనే సంప్రదించారని మరో కథనం వేడెక్కిస్తోంది. సేతుపతి కాల్షీట్లు వృధా అవ్వడంతో పోలీసాఫీసర్ పాత్ర కోసం మాధవన్ ని బరిలో దించే ఆలోచన చేస్తున్నారని ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఇంకా అధికారికంగా చిత్రబృందం ధృవీకరించాల్సి ఉంటుంది.
మరోవైపు మాధవన్ నటించిన సవ్యసాచి- నిశ్శబ్ధం చిత్రాలు డిజాస్టర్లుగా నిలవడంతో మహేష్ అభిమానులు సెంటిమెంట్ ఫీలవుతున్నారని కథనాలొచ్చాయి. మరి మ్యాడీ రాకకు బన్ని అభిమానులు స్వాగతం పలుకుతారా? అన్నది ఇప్పటికైతే సస్పెన్స్!!