వైయస్సార్ `యాత్ర`లో జగన్ పాత్ర ఉంటుందా? ఉంటే దాని పరిధి ఎంత? అంటూ జనంలో రకరకాల సందేహాలున్నాయి. ఫిబ్రవరిలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ సినిమాపై అందరి సందేహాల్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు మహి.వి.రాఘవ్. ముఖ్యంగా ఈ చిత్రంలో వైయస్సార్ పాత్రలో నటించిన మమ్ముట్టి గురించి - అలాగే జగన్ పాత్ర పరిధి గురించి మహి స్పష్టంగా చెప్పుకొచ్చారు.
యాత్ర చిత్రం పాదయాత్రలో కీలక ఘట్టాలపై సినిమా. అందుకే దానిపై మాత్రమే దృష్టి సారించాం. వై.ఎస్.జగన్ పాత్ర ఈ సినిమాలో ఉండదు. ఆయన రియల్ విజువల్స్ మాత్రమే చూపించాం. అందులో జగన్ కనపడతారు... అని తెలిపారు. జగన్ పాత్రను స్క్రిప్ట్‌లో రాశాం... కానీ చివర్లో వద్దనుకున్నాం. వై.ఎస్ పాత్రతో కనెక్టివిటీ మిస్సవ్వకుండా ఈ జాగ్రత్త తీసుకున్నాం. ఎమోషనల్ జర్నీ పోకూడదని భావించామని అన్నారు.
జగన్ టీజర్ చూసి ఏమన్నారు? అన్న ప్రశ్నకు మహి.వి.రాఘవ్ తనదైన శైలిలో జవాబిచ్చారు. జగన్ సార్ టీజర్ చూసి బావుందన్నారు. సినిమా చూస్తారా సార్? అని అడిగితే మీ నాయకుడి కథ మీరు చెప్పారు కదా అని అన్నారు. ఏం చేయాలో నేను చెబితే క్రియేటివిటీ దెబ్బ తింటుందని మాతో అన్నారు. నిజానికి వాళ్లే సినిమా తీయాలనుకుంటే నేను దర్శకుడిని అయ్యేవాడిని కాను. నాకంటే ఇంకా బాగా చేసేవారేమో.. ఎవరో వాళ్ల కోణంలో వాళ్ల నాయకుడిని చూపించాలనుకుంటున్నారు అని వాళ్లు అనుకున్నారు. అందుకే నా పని నేను సవ్య ంగా చేసుకున్నా.. అని తెలిపారు.
ఎన్నికల్లో ప్రజల్ని ప్రభవితం చేస్తున్నారా? అన్న ప్రశ్నకు .. అసలు 30-40 ఏళ్ల క్రితం అయితే ఇలాంటివి నమ్మొచ్చు. కానీ ఇప్పుడు ఓటరు తెలివైన వారు. ఎవరికి ఓటేస్తే మాకేంటి అనే టైపు. సినిమాలు ఎన్నికలను ప్రభావితం చేస్తే సూపర్‌స్టార్స్ అందరూ ముఖ్యమంత్రులైపోతారు. కానీ సినిమాలకు, రాజకీయాలకు చాలా తేడా ఉందని ప్రజలకు బాగా తెలుసు. దీని వల్ల రెండు, మూడు ఓట్లు కూడా రావనేది నా భావన.. అని మహి.వి. రాఘవ్ అన్నారు.