సినీ సెలెబ్రెటీల వ్యక్తిగత జీవితలపై ఎప్పుడు ఎదో ఒక కామెంట్ వినిపించడం ఈ రోజుల్లో సర్వసాధారణం. ఏమి లేకపోతేనే వందల రూమర్స్ వెంటాడుతుంటాయి. ఇక వారి ప్రయివేట్ ఫొటోస్ దొరికితే ఏమైనా ఉందా నిమిషానికి ఒక న్యూస్ వారిని భాదిస్తుంటోంది. ఈ క్రమంలో కొందరు తారలు చాలా నిరాశకు గురవుతుంటారు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ సుందరాంగి మహిరా ఖాన్ కూడా చాలా మనోవేదనకు గురవుతోందట.
కొన్ని నెలల క్రితం అమ్మడు లండన్ విధుల్లో రనబీర్ కపూర్ తో సిగరెట్ తాగుతూ.. పొట్టి దుస్తుల్లో కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెను అప్పటివరకు అభిమానం చూపినా వారు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. పాకిస్థాన్ మోడల్ ఇలా చేసిందేంటి అని ప్రతి ఒక్కరు నెగిటివ్ గా కామెంట్ చేయడంతో అమ్మడు చాలా మనోవేదనకు గురైందట. అయితే ఆమెకు మద్దతుగా రనబీర్ అలాగే ఇతర నటీనటులు నిలిచారు. విషయం పై చాలా మంది స్పందించారు. కానీ మహిరా మాత్రం అస్సలు మాట్లాడలేదు.
అయితే ఫైనల్ గా తను చేసింది తప్పు అని చాలా ఫీల్ అయ్యిందట. ఒకానొక సమయంలో ఆన్సర్ ఇద్దమనుకున్న ట్రోల్స్ చూసి చాలా హార్ట్ అయ్యిందట. ఫైనల్ గా ఈ పాకిస్థాన్ మోడల్ తను చేసింది చాలా తప్పని ఇటీవల క్షమించండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అయితే సినీ తారల జీవితాలు ఎవరి ఇష్టం ఉన్నట్లు వారు జీవిస్తారు. నెగిటివ్ కామెంట్స్ వచ్చినా కొందరు పట్టించుకోరు. కానీ మహిరా మాత్రం తన తప్పును ఒప్పుకొంది అంటే..అమ్మడు స్పెషల్ అంటున్నారు ఓ వర్గం వారు.