RRR ట్రీట్ కోసం మాహిష్మ‌తి వెయిటింగ్

Update: 2020-02-04 04:23 GMT
RRR టీమ్ యాక్టివిటీస్ బ్ర‌హ్మ‌ర‌హ‌స్యంగా మారాయి. లీక్డ్ ఫోటోలు ఇబ్బందిక‌రంగా ఉన్నా.. ప్ర‌చారం విష‌యంలో అస‌లు తామేం చేస్తున్నారో మాత్రం అస్స‌లు అభిమానుల‌కు క్లారిటీ ఇవ్వ‌కుండా నాన్చేయ‌డంపై ఇప్ప‌టికే విసిగెత్తిపోయారంతా. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా RRR టీమ్ అభిమానుల‌కు ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందో తెలిసిందే. పాత పోస్ట‌ర్ కే కొత్త రంగులేసి ఊరించే ప్ర‌య‌త్నం చేశారు. దానికి ప్ర‌తిగా ఘోరంగా చీవాట్లు తిన్నారు. నెటిజ‌నులు ఆ పోస్ట‌ర్ పై ట్రోల్ చేసి ర‌చ్చ చేసారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా దాడికే దిగారు. ఇది తెలివైనా ప‌నా? తెలివి త‌క్కువ ప‌నా? అంటూ సెటైర్లు గుప్పించారు. ప్ర‌తి పండ‌గ‌కు స్పెష‌ల్ తో దూసుకొస్తామ‌ని అన్నారు. చివ‌రికి ఊరించి విసిగించారు.

జ‌నాల‌ కామెంట్లపై ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఇప్ప‌టి వ‌ర‌కూ ఎలాంటి రిప్లై ఇవ్వ‌లేదు. తాజాగా దాదాపు ఇలాంటి వార్ ఆర్.ఆర్.ఆర్ ట్విట‌ర్ హ్యాండిల్ టీమ్ కి.. బాహ‌బ‌లి అభిమానులకు మ‌ధ్య జ‌రిగింది. అయితే అదంతా ఫ‌న్ కోసం మాత్ర‌మే. టైటిల్‌ ఫ‌స్ట్ లుక్ ..టీజ‌ర్..ట్రైల‌ర్ కోసం అభిమానులు ఎంతో ఆశ‌గా ఎదురుచూస్తున్నారు. మాహిష్మ‌తి పౌరులుగా మేమంతా ఎదురు చూస్తున్నాం. ఆ ట్రీట్ ఎప్పుడు ఉంటుంది జ‌క్క‌న్నా అంటూ మ‌హిష్మ‌తి అభిమానులు ప్ర‌శ్నించారు. అందుకు ఆర్.ఆర్.ఆర్ టీమ్ ఏమ‌ని స్పందించింది అంటే? బాహుబ‌లి ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ కోసం ఎలా వెయిట్ చేసారో? ఇప్పుడు అలాగే కీప్ వెయిటింగ్ అంటూ మ‌రోసారి ఊరించింది టీమ్.

బాహుబ‌లి ద‌ర్శ‌కుడు జ‌క్క‌న్న‌నే అయినా.. ఫ్యాన్స్ ఆన్ లైన్ వార్ మ‌రోసారి..న్యూ ఇయ‌ర్ పోస్ట‌ర్ లా చ‌ర్చ‌కు దారి తీస్తుంది. వెయిట్ చేస్తే ఏదో ఒక రోజు రిలీజ్ చేస్తార‌ని అంద‌రికీ తెలిసిన‌దే. ఆ తేదీ కోసమే క‌దా మాహిష్మ‌తి పౌరులు గా అడిగింది. అస‌లు సంగ‌తి చెప్ప‌కుండా వెయింటింగ్ అంటూ సాగ‌దీయ‌డం ఎందుకు? అంటూ నెటిజ‌నులు కామెంట్ల తో విరుచుకు ప‌డుతున్నారు. ఈ కామెంట్ల‌ కు జ‌క్క‌న్న ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News