'కంబాలపల్లి కథలు' చాప్టర్-1 'మెయిల్' టీజర్ వచ్చేసింది..!!

Update: 2020-12-30 13:40 GMT
'మహానటి' చిత్రాన్ని నిర్మించిన స్వప్నదత్ - ప్రియాంకదత్ కలిసి ''కంబాలపల్లి కథలు'' అనే వెబ్ సిరీస్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హాస్యనటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో స్వప్న సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సిరీస్ కి ఉదయ్ గుర్రాల దర్శకత్వం వహిస్తున్నారు. 'కంబాలపల్లి కథలు'లోని మొదటి చాప్టర్ 'మెయిల్' ను సంక్రాంతి కానుకగా ‘ఆహా’ ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 'మెయిల్' కు సంబంధించిన టీజర్‌ ను మేకర్స్ విడుదల చేశారు.

'2005.. అప్పుడప్పుడే ఊర్లల్లో కంప్యూటర్ పరిచయమవుతున్న రోజులు' అంటూ ఈ టీజర్‌ ప్రారంభమవుతుంది. 'కంప్యూటర్ నేర్చుకోవాలంటే మూడు రూల్స్.. రూల్ నెం.1 స్నానం చేసి రావాలి.. రెండవది చెప్పులు బయటనే విడిచి పెట్టాలి.. నేను చెప్పిన సమయానికి రావాలి.. రూల్ నెం.2 అంజి గాడు రమేశ్ లాగా వేరే దుకాణం పెడతా అంటే మంచిగా ఉండదు' అని తెలంగాణా మాండలీకంలో ప్రియదర్శి చెప్పే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. మెయిల్ ఐడీ క్రియేట్ చేయించడం.. దానికి పాస్ వర్డ్ పెట్టడం వంటివి ఈ సిరీస్ పై ఆసక్తిని కలిగిస్తున్నాయి. పల్లెటూరి నేపథ్యంలో రూపొందనున్న ఈ సిరీస్ లో దర్శి 'హైబత్' అనే కంప్యూటర్ సెంటర్ నిర్వహించే వ్యక్తిగా కనిపిస్తున్నాడు. 'మెయిల్' కి స్వీకార్ సంగీతాన్ని సమకూర్చాడు. లేటెస్టుగా విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తోంది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : https://www.youtube.com/watch?v=GJtgsb7HIXQ&feature=youtu.be
Tags:    

Similar News