అక్కినేని నాగచైతన్య నటిస్తున్న మళయాళ ప్రేమమ్ రీమేక్ మజ్ను.. ఈ నెల ప్రారంభం నుంచి షూటింగ్ జరుపుకుంటోంది. స్టోరీ ప్రకారం మూడు వయసుల్లో కనిపించనున్న చైతూకి.. ఇప్పటివరకూ ఇద్దరు హీరోయిన్లను మాత్రమే ఫైనల్ చేశామని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.
"అనుపమా పరమేశ్వరన్ - శృతిహాసన్ లను మాత్రమే ఇప్పటివరకూ తీసుకున్నాం. వాళ్లిద్దరూ ఇప్పటికే షూటింగ్ కూడా ప్రారంభించేశారు. ప్రస్తుతం మూడో హీరోయిన్ గా ఐషా శర్మను అనుకుంటున్నాం. కానీ ఇంకా ఫైనల్ కాలేద"ని మేకర్స్ చెబ్తున్నారు. ఇప్పటికే మూడో హీరోయిన్ గా రెజీనాను తీసుకున్నారనే వార్తలను ఖండించారు నిర్మాతలు. ఆమెను అనుకున్న మాట వాస్తవమే అయినా.. ఇప్పటివరకూ అప్రోచ్ కాలేదట. ఒక వేళ ఏదైనా కారణాలతో ఐషా శర్మ మజ్నూకి సైన్ చేయకపోతేనే.. వేరే హీరోయిన్ గురించి ఆలోచిస్తామని తేల్చేశారు.
మూడు ప్రేమ కథల్లో భాగంగా అనుపమా పరమేశ్వరన్ స్కూల్ విద్యార్ధిగా కనిపించనుండగా, శృతిహాసన్ కాలేజ్ లెక్చరర్ గా అలరించనుంది. ఇక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కోసం మూడో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి ఉంది. ఈ మజ్ను చిత్రాన్ని చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా.. ఎస్. రాధాకృష్ణ నిర్మాత.