చిత్రం : ‘మజ్ను’
నటీనటులు: నాని - అను ఇమ్మాన్యుయెల్ - ప్రియశ్రీ - సత్య - వెన్నెల కిషోర్ - పోసాని కృష్ణమురళి - సప్తగిరి తదితరులు
సంగీతం: గోపీసుందర్
ఛాయాగ్రహణం: జ్నానశేఖర్
నిర్మాత: పి.కిరణ్
రచన - దర్శకత్వం: విరించి వర్మ
15 నెలల వ్యవధిలో నాలుగు హిట్లు కొట్టాడు నాని. మూడు నెలల కిందటే అతను ‘జెంటిల్ మన్’ సినిమాతో పలకరించాడు. ఇంతలోనే ‘మజ్ను’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వం వహించిన సినిమా ఇది. నాని.. విరించిలకు మరో విజయాన్నందించే కళ కనిపించింది ఈ సినిమాలో. ప్రోమోస్ అన్నీ అంత పాజిటివ్ గా కనిపించాయి. మరి ‘మజ్ను’ సినిమా అంచనాల్ని ఏ మేరకు అందుకుందో చూద్దాం పదండి.
కథ:
ఆదిత్య (నాని) దర్శకుడు రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా పని చేస్తుంటాడు. తన స్నేహితుడు ప్రేమిస్తున్న సుమ (ప్రియశ్రీ)ను చూసి అట్రాక్ట్ అయిన ఆదిత్య ఆమె వెంట పడతాడు. ఆదిత్య తీరు నచ్చడంతో సుమ కూడా అతడి వైపు ఆకర్షితురాలవుతుంది. ఆ తర్వాత ఆదిత్య ఒకప్పటి తన ప్రేమకథను సుమతో పంచుకుంటాడు. భీమవరంలో ఉండగా కిరణ్ (అను ఇమ్మాన్యుయెల్)ను చూసి ఎలా ఇష్టపడింది.. ఆమె ఎలా తన ప్రేమలో పడింది.. తాము ఎలా విడిపోయింది చెబుతాడు ఆదిత్య. ఐతే కిరణ్ ను ఆదిత్య మరిచిపోయాడనుకుని అతణ్ని సుమ ప్రేమిస్తుంది. కానీ ఆదిత్య మనసులో కిరణ్ నిలిచే ఉంటుంది. తిరిగి ఆమె అతడి జీవితంలోకి వస్తుంది. మరి ఈ ఇద్దరమ్మాయిలతో ఆదిత్య ప్రయాణం ఎలా సాగింది..చివరికి అతను ఎవరితో జీవితాన్ని పంచుకున్నాడు అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
‘ఉయ్యాల జంపాల’లో మనకు అలవాటైన బావా మరదళ్ల కథనే ఆహ్లాదంగా చెప్పి మెప్పించిన విరించి వర్మ.. మరోసారి పాత కథతోనే రొటీన్ గానే మెప్పించాడు. ప్రేమకథను ఆహ్లాదంగా.. ఫీల్ తో నడిపించడంలో విరించి వర్మ మరోసారి విజయవంతమయ్యాడు. ఇక మామూలు సన్నివేశాల్ని కూడా తన నటనతో మరో స్థాయికి తీసుకెళ్లే నాని.. విరించికి తోడవడంతో ‘మజ్ను’ అలరించే సినిమాగా తయారైంది. మామూలుగా అనిపిస్తూనే ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా సాఫీగా సాగిపోతుంది ‘మజ్ను’ ప్రయాణం. కాకపోతే సగం వరకు మంచి ఊపు మీద సాగే సినిమా... ఇంకో సగంలో మరీ రొటీన్ అయిపోవడం నిరాశ పరుస్తుంది.
కథగా చెప్పడానికి ‘మజ్ను’లో కొత్తదనం ఏమీ లేదు. ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకోవడం.. అపార్థాలు అభిప్రాయ భేదాలతో విడిపోవడం.. తర్వాత ఈ అబ్బాయి జీవితంలోకి అనుకోకుండా మరో అమ్మాయి రావడం.. అతను ఇంకా పాత అమ్మాయినే మనసులో పెట్టుకోవడం.. ఉన్నట్లుండి ఆ అమ్మాయి ఊడిపడటం.. ఇలా చాలాసార్లు చూసిన తరహాలోనే సాగుతుంది ‘మజ్ను’ కూడా. ఇక కథనం కూడా మరీ కొత్తగా ఏమీ ఉండదు. కానీ మామూలు సన్నివేశాలతోనే విరించి-నాని జోడీ అలరించింది. లాగ్ లేకుండా.. హెవీ మూమెంట్స్ లేకుండా లైటర్ వీన్లో సరదాగా సాగుతూ కథనం అలరిస్తుంది. సినిమా అవకాశాల కోసం నానికి రౌడీలు ఫోన్ చేయడం నేపథ్యంలో సాగే ట్రాక్ ఒక్కటి కొంచెం ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. మిగతా అంతా కూడా సిచువేషనల్ కామెడీతోనే నవ్వించారు.
భీమవరం నేపథ్యంలో నడిచే ఫ్లాష్ బ్యాక్ ప్రేమకథ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ‘మిరపకాయ్’ తరహాలో ఎంటర్టైనింగ్ గా సాగే లెక్చరర్-స్టూడెంట్ లవ్ స్టోరీ ఆద్యంత అలరిస్తుంది. ప్రేమలోని అందమైన అనుభూతుల్ని అంతే అందంగా చెప్పాడు విరించి. ఈ ఎపిసోడ్లో నడిచే వ్యవహారమంతా రొటీనే అయినా.. ఏముంది ఇందులో అనిపించకుండా.. ఎంత అందంగా ఆహ్లాదంగా నడుస్తోందో అన్న ఫీలింగ్ కలుగుతుంది. యువ ప్రేక్షకులు బాగా ఐడెంటిఫై అయ్యేలా ఈ ఎపిసోడ్ సాగుతుంది. ప్రేమ అనుభవమున్న ప్రతి ఒక్కరూ తమను తాము చూసుకునేలా ఫ్లాష్ బ్యాక్.
ఐతే ప్రథమార్ధం వరకు చాలా ఫ్రెష్ గా అనిపించే ‘మజ్ను’.. ద్వితీయార్ధానికి వచ్చేసరికి రొటీన్ బాట పడుతుంది. ముక్కోణపు ప్రేమకథలో దాగుడుమూతలు మొదలయ్యాక.. కథనం ఎలా సాగుతుందనే విషయంలో ముందే ఓ అంచనాకు వచ్చేస్తారు ప్రేక్షకులు. ఇక చివరిదాకా ఏం జరుగుతుందో ఈజీగా చెప్పేయొచ్చు. ప్రి క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి సినిమా దారి తప్పుతున్న భావన కూడా కలిగిస్తుంది. కానీ క్లైమాక్స్ మళ్లీ సినిమాను పైకి తెస్తుంది.
ప్లాట్ విషయంలో ద్వితీయార్ధాన్ని తేల్చేసిన విరించి.. కొన్ని ఆకర్షణలు మాత్రం జోడించాడు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ను స్నిపెట్స్ లాగా వాడుకుంటూ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో ద్వితీయార్ధాన్ని నడిపించాడు. ఆ మూమెంట్స్ ప్రేక్షకుడికి మంచి ఫీలింగ్ ఇస్తాయి. హీరోయిన్ పుట్టిన రోజు నాటి జ్నాపకాల్ని హీరో తలుచుకునే సీన్ అందులో ఒకటి. వెన్నెల కిషోర్ క్యారెక్టర్.. అతడి డైలాగ్స్ బాగున్నాయి. నాని-కిషోర్ కాంబినేషన్లు భలే పండాయి. ప్రేమలోని రసాల్ని చూపించే సీన్ బాగా పండింది. ప్రి క్లైమాక్స్ లో కొంచెం సాగతీత అనిపించినా.. మళ్లీ క్లైమాక్స్ లో సినిమా గ్రాఫ్ పెరుగుతుంది. ఈ మధ్య ‘అఆ’ సినిమాను ముగించినట్లుగా.. చాలా సరదాగా ముగించారు. నాని మార్కు నటన.. ఎంటర్టైన్మెంట్ క్లైమాక్స్ కు పెద్ద బలంగా నిలిచింది.
కథ రొటీన్ గా ఉండటం.. ద్వితీయార్దంలో ప్రెడిక్టబిలిటీ ‘మజ్ను’కు చెప్పుకోదగ్గ వీక్ పాయింట్స్. ఓ అమ్మాయిని మనసులో పెట్టుకుని.. ఇంకో అమ్మాయి వెంట పడటం.. తనను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నించడం.. ఆ తర్వాత పాత అమ్మాయే తన మనసులో ఉందనడంలో ఔచిత్యం కనిపించదు. రెండో హీరోయిన్ హీరోను ప్రేమించడానికి కూడా సరైన కారణాలు కనిపించవు. ఈ లోపాల్ని పక్కనబెట్టేస్తే.. మజ్ను ఎంగేజింగ్ మూవీనే.
నటీనటులు:
నాని గురించి ప్రతిసారీ చెప్పిన మాటలే చెప్పాల్సి ఉంటుంది. అతణ్ని తెర మీద చూడటంలో ఉన్న ఆనందమే వేరు. ఒక సన్నివేశం చూస్తూ.. ఇదే సీన్లో మరొకరు ఉంటే ఎలా ఉంటుంది అని ఊహించుకుంటే నాని గొప్పదనం ఏంటో తెలిసిపోతుంది. ఇంట్రడక్షన్ సీన్లో రాజమౌళి ముందు తడబడుతూ డైలాగ్ చెప్పే సీన్ నుంచి.. చివర్లో మజ్నులా మారిపోయి ఇళయరాజా పాటలు వింటూ తనదైన శైలిలో హావభావాలు పలికించే సన్నివేశం వరకు నాని ఆద్యంతం అలరిస్తాడు. అతడి కామిక్ టైమింగ్ ఎంతగా మెప్పిస్తుందో.. ప్రి క్లైమాక్సులో భావోద్వేగాలు పలించే తీరు కూడా అంతే మెప్పిస్తుంది. ఫలానా సీన్ అని కాదు కానీ.. ఆద్యంతం నాని అలరించాడు. ఈ సినిమాలో నాని లేకుంటే దాని మీద ఇంప్రెషన్ మరోలా ఉండేదంటే అతిశయోక్తి కాదు.
ఇక మలయాళ భామ అను ఇమ్మాన్యుయెల్ తో ఈజీగా ప్రేమలో పడిపోతాం. ఆమె అందం.. అభినయం రెండూ ఆకట్టుకుంటాయి. రెగ్యులర్ హీరోయిన్ ఫీచర్స్ లేకపోయినా.. కొంచెం చిన్న పిల్లలా అనిపించినా.. అను మెప్పిస్తుంది. ఆమె కళ్లు బాగున్నాయి. హావభావాలతోనూ ఆకట్టుకుంది. ఇంకో హీరోయిన్ ప్రియశ్రీ పర్వాలేదు. హీరో ఫ్రెండుగా చేసిన సత్యతో పాటు వెన్నెల కిషోర్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రాజ్ తరుణ్ అతిథి పాత్రలో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లంతా కూడా ఓకే.
సాంకేతికవర్గం:
గోపీసుందర్ మరోసారి మెప్పించాడు. దర్శకుడి అభిరుచికి తగ్గట్లు సినిమాకు సరిపోయే సంగీతం అందించాడు. కళ్లు మూసి తెరిచే లోపే.. ఓయ్ మేఘమాల పాటలు గుర్తుండిపోతాయి. ఆ పాటల చిత్రీకరణ కూడా చాలా హాయిగా అనిపిస్తుంది. గోపీ నేపథ్య సంగీతం కూడా బాగుంది. జ్నానశేఖర్ ఆహ్లాదంగా సాగిపోతుంది. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో కెమెరా పనితనం అడుగడుగునా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రైటర్ కమ్ డైరెక్టర్ విరించి వర్మ.. మరోసారి మంచి మార్కులే వేయించుకున్నాడు. మామూలు కథనే అందంగా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ప్రేమకథను చెప్పినంత ప్రభావవంతంగా మిగతా కథను నడపలేకపోయాడు. నాని లాంటి నటుడుండటం అతడి లోపాల్ని కవర్ చేసింది. అతను ద్వితీయార్దం విషయంలో రాజీ పడ్డాడనిపిస్తుంది. కొంచెం భిన్నంగా ప్రయత్నించాల్సింది.
చివరగా: కొంత కష్టపెట్టినా.. ఈ ‘మజ్ను’ ప్రేమలో పడిపోతాం!
రేటింగ్: 3/5
Disclaimer : This Review is An Opinion of Review Writer. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre